Begin typing your search above and press return to search.
జీ 5లో ఈ నెల 21 నుంచి 'లూజర్ 2' స్ట్రీమింగ్!
By: Tupaki Desk | 18 Jan 2022 4:24 AM GMTఇప్పుడు సినిమాలతో వెబ్ సిరీస్ లు పోటీపడుతున్నాయి. సినిమాల క్వాలిటీతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. ఏదో సాదా సీదాగా కానిచ్చేద్దాం అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇతర భాషల్లోని వెబ్ సిరీస్ లు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడవలసిన అవసరం ఉంది. అలాగే కంటెంట్ విషయంలో కూడా ఎన్నో జ్రాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కంటెంట్ ఎక్కడ లూజ్ గా ఉంటే అక్కడి నుంచి ప్రేక్షకులు జారిపోతారు. అందువలన కంటెంట్ .. ఖర్చు విషయంలో జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వారు ఎక్కడా తగ్గడం లేదు. సినిమాలతో సమానమైన వినోదాన్ని వెబ్ సిరీస్ ల ద్వారా ఇవ్వడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
జీ 5 వివిధ భాషల్లో .. వెబ్ సిరీస్ ల విషయంలో తన టార్గెట్ ను టచ్ చేస్తూ వెళుతోంది. తెలుగులో వారు ప్రసారం చేసిన 'లూజర్' వెబ్ సిరీస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో దానికి సీక్వెల్ గా వారు 'లూజర్ 2'ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వారు .. స్ప్రెక్టమ్ మీడియావారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. తొలి సీజన్ కి అభిలాష్ రెడ్డి దర్శకత్వ వహిస్తే, సెకండ్ సీజన్ కి అభిలాష్ రెడ్డితో పాటు శ్రవణ్ మాదాల కూడా దర్శకుడిగా ఉన్నారు.
సాయి శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని సమకూర్చిన ఈ వెబ్ సిరీస్ లో, ప్రియదర్శి .. ధన్యా బాలకృష్ణ .. కల్పిక గణేశ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా, హైదరాబాద్ లోని 'ట్రైడెంట్' హోటల్లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. జీ 5 హెడ్స్ తో పాటు నాగార్జున .. అమల .. సుప్రియ .. బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ తదితరులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. నాగార్జున మాట్లాడుతూ .. " ఓటీటీ అనే ఒక సాంకేతిక విప్లవం ఇప్పుడు నడుస్తోంది. ప్రేక్షకులు కోరుకుంటున్న వినోదం ఇప్పుడు ఫోన్ లోకి వచ్చేసింది.
ఓటీటీలో వెబ్ సిరీస్ తీయడం అంత తేలికైన విషయం కాదు. అది ప్రేక్షకులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన 'లూజర్ 2' అద్భుతంగా వచ్చింది. అడుగడుగునా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ లోని కథ అర్థమయ్యేలా ట్రైలర్ ను కట్ చేయడం జరిగింది. అందువలన ఈ కథకి ప్రేక్షకులంతా తప్పకుండా కనెక్ట్ అవుతారని అనిపిస్తోంది. ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న 'లూజర్ 2' .. టీమ్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత మిగతావారంతా మాట్లాడుతూ, ఈ వెబ్ సిరీస్ తప్పకుండా సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.