Begin typing your search above and press return to search.

బాల‌య్య సినిమాలో ఆ నాలుగు హైలెట్లు

By:  Tupaki Desk   |   28 Nov 2016 10:14 AM GMT
బాల‌య్య సినిమాలో ఆ నాలుగు హైలెట్లు
X
బాల‌కృష్ణ సినిమా అంటే అందులో హైలెట్ అయ్యేది ఆయ‌న చెప్పే డైలాగులే. మాస్‌ ని అల‌రించేలా డైలాగుల్ని ప‌ల‌కడం బాల‌కృష్ణ శైలి. అందుకే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఆ విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతుంటారు. బాల‌య్య వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలోనూ డైలాగులు పేలిపోనున్నాయ‌ట‌. తెలుగు చ‌క్ర‌వ‌ర్తి క‌థ కావ‌డంతో తెలుగు జాతి.... తెలుగు ప‌రాక్ర‌మం... తెలుగు భాష, వైభ‌వాన్ని చాటి చెప్పేలా డైలాగుల్ని రాయించాడ‌ట ద‌ర్శ‌కుడు క్రిష్‌. వాటిని బాల‌య్య ప‌లికిన విధానం కూడా సూప‌ర్బ్‌గా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

అయితే ఆ డైలాగుల‌తోపాటు - వార్ ఎపిసోడ్లు కూడా కీల‌క‌మేన‌ట‌. సినిమాలో నాలుగు వార్ ఎపిసోడ్లు ఉంటాయ‌ట‌. అవి గ్రాఫిక్స్ హంగుల‌తో బాల‌కృష్ణ సినిమాల్లోనే కాదు, తెలుగు తెర‌పై ఎప్పుడూ చూడ‌ని విధంగా ప‌వ‌ర్‌ ఫుల్‌ గా ఉంటాయ‌ట‌. అందులో స‌ముద్రంలో వార్ ఎపిసోడ్ అయితే ఇంకా బాగుంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. క్రిష్ కూడా నాలుగు వార్ ఎపిసోడ్లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశాడు. అలాగే సినిమా ర‌న్ టైమ్ 2 గంట‌ల 12 నిమిషాలు ఉంటుంద‌ని, ప్రతీ సీన్ రేసీగా సాగుతుంద‌ని ఆయ‌న తెలిపాడు. డిసెంబ‌రు 16న తిరుప‌తిలో పాట‌ల వేడుక‌ని నిర్వ‌హించ‌నున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించాడు క్రిష్‌. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమాల హ‌డావుడి షురూ అవుతోంది. మ‌ధ్య‌లో స‌రిగ్గా ఒక నెల స‌మ‌య‌మే ఉండ‌టంతో ఆ లోపు వీలైనంతగా ప్ర‌చారం చేసి ఓ ప్ర‌త్యేక‌మైన ఊపుని తీసుకురావాల‌నుకొంటున్నారు. ఆ విష‌యంలో బాల‌య్య అయితే ఒక అడుగు ముందే ఉన్న‌ట్టు తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/