Begin typing your search above and press return to search.
కాష్మోరా.. ఆసక్తికర సంగతులు
By: Tupaki Desk | 27 Oct 2016 5:53 PM GMTగత కొన్నేళ్లలో సౌత్ ఇండియన్ సినిమా రేంజే మారిపోయింది. బాలీవుడ్లోళ్లను మించిపోయి భారీ సినిమాలు తీసేస్తున్నారు దక్షిణాది ఫిలిం మేకర్స్. మగధీర.. ఈగ.. బాహుబలి.. కంచె.. రోబో లాంటి సినిమాలు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. ఈ కోవలోకి చేరేలా కనిపిస్తోంది ‘కాష్మోరా’. ట్రైలర్ చూస్తే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ శుక్రవారమే ‘కాష్మోరా’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు.
! కాష్మోరా బడ్జెట్ దాదాపు రూ.60 కోట్లు. కార్తి కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే.
! కాష్మోరా సినిమా బడ్జెట్లో దాదాపు రూ.15 కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేశారు. దాదాపు 1800 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉండబోతున్నాయి.
! ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ 19 భారీ సెట్లు తీర్చిదిద్దాడు. వాటిలో రాజదర్బార్ సెట్ కళ్లు చెదిరేలా ఉంటుంందంటున్నారు.
! కార్తి ఈ సినిమాలో మూడు గెటప్పుల్లో కనిపిస్తాడు. అందులో ఒకటి కాష్మోరా.. ఇంకోటి రాజ్ నాయక్. మూడో పాత్ర సస్పెన్స్ అంటున్నారు. రాజ్ నాయక్ పాత్ర కోసం త్రీడీ ఫేస్ స్కాన్ అనే టెక్నాలజీని ఉపయోగించారు.
! ఈ చిత్రంలో దాదాపు 90 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకోసం 25 గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీలు రెండు నెలల పాటు పని చేశాయి.
! ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో కాష్మోరా రిలీజవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట ఈ సినిమాకు 450 స్క్రీన్లే ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/