Begin typing your search above and press return to search.

నాన్నకు ప్రేమతో హైలైట్లే హైలైట్లు

By:  Tupaki Desk   |   8 Jan 2016 7:41 AM GMT
నాన్నకు ప్రేమతో హైలైట్లే హైలైట్లు
X
సంక్రాంతికి నాలుగు సినిమాలొస్తున్నాయి కానీ.. అన్నింట్లోకి ఆసక్తి రేపుతున్నది మాత్రం ‘నాన్నకు ప్రేమతో’నే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అన్నింట్లోకి ఇదే వైవిధ్యంగా కనిపిస్తోంది. పైగా ఎన్టీఆర్ - సుకుమార్‌ ల సెన్సేషన్ కాంబినేషన్ కూడా జనాల్లో ఎంతో క్యూరియాసిటీ పెంచింది. ట్రైలర్ కూడా ఆ ఆసక్తిని మరింత పెంచింది. ఇంతకీ సుకుమార్ ఏం చూపించాడు.. ఎన్టీఆర్ ఎలా చేశాడు.. అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

‘నాన్నకు ప్రేమతో’ యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హైలైట్లకు కొదవలేదు. ప్రధానంగా మూడు నాలుగు అంశాల గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు.

తండ్రీ కొడుకులైన రాజేంద్ర ప్రసాద్ - ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు బలమైన ఇంపాక్ట్ వేస్తాయని.. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ కన్నీళ్లు పెట్టించేస్తుందని.. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ ఎక్స్ ట్రార్డినరీ అని చెబుతున్నారు. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ఆడియో ఫంక్షన్లో ప్రస్తావించింది కూడా ఈ సన్నివేశం గురించేనట. ఇక జగపతిబాబు - ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ సన్నివేశాలు అభిమానుల్లో ఉత్సాహం నింపుతాయట. ఇక పాటలు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు. ఎన్టీఆర్ నభూతో అనే స్థాయిలో డ్యాన్సులు ఇరగదీశాడట. మొత్తానికి సినిమాలో హైలైట్లకైతే కొదవ లేదని.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అంశాలు సినిమాలు ఉన్నాయని చెబుతున్నారు.