Begin typing your search above and press return to search.
సింగం3లో చివరి 45 నిమిషాలే...
By: Tupaki Desk | 22 Jan 2017 4:14 AM GMTతమిళనాడులో ఓ వైపు జల్లికట్టును చట్టబద్ధం చేయాలని అందరూ ముక్తకంఠంతో గొంతెత్తుతున్నారు. మరోవైపు సూర్య ‘సింగం3’ విడుదలకు సిద్ధం అవుతోంది. అందుకు కావాల్సిన పబ్లసిటీ పనులు తెలుగులో మాత్రం ముమ్మరం చేసేశారు ఈ చిత్రం హక్కులు పొందిన నిర్మాత మల్కాపురం శివకుమార్. ఇప్పటికే జనవరి 26న విడుదల అంటూ పేపర్.. టెలివిజన్ యాడ్స్ ఇవ్వడం కూడా మొదలెట్టేశారు. హైదరాబాద్ నగరంలో అయితే సింగం3 రిలీజ్ పోస్టర్లు అతికించేసి పబ్లిసిటీనీ పీక్ కు చేరేలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
సింగం-1 - సింగం-2లో ఏది బాగా హిట్టయిందంటే.. సింగం-1 అనే చెప్పొచ్చు. అది హిట్టయినంత రేంజ్ లో సింగం-2 కాలేదు. రెండో భాగం కథ కాస్త స్లోగా వుండటంతో.. మొదటి భాగం అంత రేంజులో ఇది విజయం సాధించలేదు. ఆ విషయం దర్శకుడు హరికి కూడా బాగా తెలుసు. అందుకే... సింగం-3ని తీయడానికి చాలా టైం తీసుకున్నాడు. రెండో సీక్వెల్లో చేసిన పొరపాట్లకు తావివ్వకుండా... మూడో భాగానికి చాలా పకడ్బంధీగా కథను తయారు చేసుకున్నాడట. మాస్ కు కావాల్సిన స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్ గా సింగం3ను తెరకెక్కించాడని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
ముఖ్యంగా చివరి 45 నిమిషాలు సినిమా బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. సూర్య ఈ నలభై ఐదు నిమిషాలు తన నట విశ్వరూపాన్నే చూపించేశాడట. దర్శకుడు హరి చాలా కేర్ తీసుకుని ఇంట్రెస్టింగ్ కథనంతో చివరి అరగంటకు పైగా సినిమాను ఎంతో పవర్ ఫుల్ గా సూర్య క్యారెక్టర్ ను తెరమీద చూపించాడట. దాంతో ప్రతి ఒక్కరూ సినిమాను చూసిన తరువాత ఓ మాంచి మాస్ మసలా చిత్రాన్ని చూశామనే ఫీలింగ్ తో బయటకొస్తారట. ఈనెల 26న విడుదలవుతోందిగా... అప్పుడు తెలుస్తుంది.. సింగం3 ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని అలరించిందో అనేది. లెట్ అజ్ వెయిట్ అండ్ సీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/