Begin typing your search above and press return to search.
24.. ప్రేక్షకులు ఫ్రీజ్ అయిపోయిన ఆ సీన్
By: Tupaki Desk | 7 May 2016 9:30 AM GMTఅది మన స్టార్ హీరో సినిమా కాదు.. పైగా మాస్ సినిమా కూడా కాదు.. అయినప్పటికీ క్లాస్-మాస్ అని తేడా లేకుండా థియేటర్లో ప్రేక్షకులందరూ ఒక్కసారిగా కేరింతలు కొట్టడం అరుదుగా జరిగే విషయం. ‘24’ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఇలాగే రెస్పాండవుతున్నారు. ఒకటి రెండు సన్నివేశాలు కాదు.. థియేటర్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడినీ స్పందింపజేసే సీన్స్ చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా టైమ్ మెషీన్లా పని చేసే ‘ఫ్రీజింగ్’ మూమెంట్ ను హీరో వాడుకునే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఓ సన్నివేశంలో హీరో ఈ ఫ్రీజింగ్ ఆప్షన్ వాడుకుని.. వర్షాన్నే ఆపేస్తాడు. దీంతో కింద పడబోతున్న చినుకులు.. మధ్యలోనే అలా ఆగిపోతాయి. ఆ షాట్ చూసిన ఎవ్వరైనా ముగ్ధులైపోవాల్సిందే. ఈ సన్నివేశంలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమనే చెప్పాలి. ఇక ఆ తర్వాత వచ్చే స్టేడియం సీన్ సినిమాకు మరో హైలైట్. చివరి బంతికి సిక్స్ కొడితేనే గెలిచే పరిస్థితుల్లో ధోని షాట్ కొడితే మలింగ క్యాచ్ పట్టేస్తాడు.
ఐతే హీరో తన వాచ్ ద్వారా ఈ సీన్ మొత్తం మార్చేస్తాడు. కాలాన్ని వెనక్కి నెట్టి.. ధోని షాట్ కొట్టాక.. టైమ్ ఫ్రీజ్ చేస్తాడు. మొత్తం సీన్ మార్చేయడమే కాదు.. ఈ సన్నివేశానికి కొసమెరుపులాగా ఫ్రీజ్ అయిపోయిన ధోని పక్కన నిలబడి సెల్ఫీ కూడా దిగుతాడు. ఆ సన్నివేశంలో అయితే థియేటర్లో ఏ ప్రేక్షకుడూ కుదురుగా కూర్చోలేడు. మొత్తంగా ఈ ‘ఫ్రీజ్’ మూమెంట్ ను వాడుకుని దర్శకుడు విక్రమ్ కుమార్ ఎంటర్టైన్మెంట్ పండించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.