Begin typing your search above and press return to search.
సినిమా సెట్లో హైటెన్షన్.. 50 మందికి కరోనా
By: Tupaki Desk | 7 Jan 2022 1:30 PM GMTఅమెరికాను మళ్లీ కరోనా ఒణికిస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు డై బై డే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే కోవిడ్ ఆంక్షల మధ్య యథావిథిగా కార్యకలాపాలు అన్ని జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా షూటింగ్ లు కూడా షరా మామూలుగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడలా షూటింగ్ చేయడమే మేకర్స్ కి ఇబ్బందిగా మారింది. తాజాగా `పారామౌంట్ సిరీస్ స్టార్ ట్రెక్` యూనిట్ కోవిడ్ భారిన పడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
క్రిస్మస్ సెలవుల అనంతరం యూనిట్ యథావిథిగా షూటింగ్ ప్రారంభించింది. దీంతో ఆ మరుసటి రోజే ఏకంగా 50 మంది కోవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో అంతా పరీక్షలు చేసుకోగా అందరికీ పాజటివ్ గా తేలింది. దీంతో యూనిట్ హుటా హుటిన షూటింగ్ నిలిపివేసింది. ఈ సినిమా కోసం దాదాపు సెట్ లో 450 మంది పనిచేస్తున్నారు. దీంతో అంతా పరీక్షలు చేసుకోగా 50 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్ ఆగిపోయింది. అయితే వచ్చే వారం నుంచి తిరిగి షటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో పికార్డ్ మూడవ సీజన్ లైవ్ లోకి రావాల్సి ఉండగా తాజా ఘటన షాకిచ్చింది.
డెడ్ లైన్ నేపథ్యంలోనే యూనిట్ తొందరపడుతోంది. మొదటి రెండు సీజన్లకు మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో థర్డ్ సీజన్ పై భారీ అంచనాలున్నాయి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత టీమ్ పై ఉంది. అయితే కోవిడ్ నేపథ్యంలో గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం..పలు టెలివిజన్ కార్యక్రమాల రెడ్ కార్పెట్ ఈవెంట్లు సైతం వాయిదా పడ్డాయి. ఇలాంటి కార్యక్రమాలకు లాస్ ఏంజెల్స్ ప్రధాన వేదిక. కానీ అక్కడే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నే అక్కడ మరింత కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు.