Begin typing your search above and press return to search.
@నర్తనశాలకు హిజ్రాల ఎఫెక్ట్!
By: Tupaki Desk | 29 Aug 2018 9:32 AM GMTకాలం మారిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయాన్ని చాలా సున్నితంగా చూస్తున్న పరిస్థితి. ఎవరికి వారు మనోభావాల విషయంలో అస్సలు రాజీ పడని పరిస్థితి. ఇలాంటివేళ.. ఏదైనా చేసేటప్పుడు.. ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. లేకుంటే అనవసరమైన వివాదాల్లోకి కూరుకుపోయే ప్రమాదం నెలకొంది.
తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది @నర్తనశాల చిత్ర బృందం. పేరులోనే సినిమాలో ఏముంటుందో తెలిసే పరిస్థితి. దీనికి తోడు ఈ చిత్ర హీరో నాగశౌర్య మీడియాతో మాట్లాడుతూ.. తనది గే క్యారెక్టర్ అని చెప్పటం.. దానిపై హిజ్రాలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిలింఛాంబర్ ముందు నిన్న కొందరు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. @నర్తనశాల చిత్రం తమ మనోభావాలు కించపరిచేలా ఉందని.. తమను డ్యామేజ్ చేసే సన్నివేశాల్ని తక్షణమే తొలగించాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రం ప్రదర్శించే థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
తమను డ్యామేజ్ చేసే సన్నివేశాల్ని తీసేయకుంటే.. సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హిజ్రాల ఆందోళనతో ఫిలింఛాంబర్ వద్ద వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. సినిమాలు- మనోభావాల వ్యవహారం ఇటీవల చాలా సినిమాలను ఇబ్బంది పెట్టింది. తాజాగా ఈ సినిమాకు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఈ సినిమాను నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మించారు. ఈ సినిమాతో శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ శుక్రవారం విడుదల కానున్న @నర్తనశాలకు హిజ్రాల ఆందోళన ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది.