Begin typing your search above and press return to search.
కబాలిపై క్రేజీ జోక్స్ పేలుతున్నాయ్..
By: Tupaki Desk | 24 July 2016 1:02 PM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హై ఎక్స్ పెక్టేషన్ మూవీ కబాలి ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోల్చుకుంటే కబాలికి నెగిటివ్ టాకే వచ్చింది. అయితే రివ్యూలతో సంబంధం లేకుండా కబాలి ఫస్ట్ డేతో పాటు ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించేలా దూసుకెళుతోంది. సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురుస్తోందన్న ప్రశంసలు వస్తున్నాయి. కబాలి నిర్మాత కలైపులి ఎస్.థాను కబాలి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు వసూలు చేసిందని ఓ ప్రకటనలో తెలపడం పెద్ద షాకింగ్ గా మారింది.
ఒక్క తమిళనాడులోనే కబాలి రూ.100 కోట్లు రాబడితే - ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు కొల్లగొట్టిందని ఆయన ప్రకటించారు. మరో వైపు కబాలి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు - రూ. 53 కోట్ల షేర్ రాబట్టినట్టు మరో లెక్కలు చెపుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో ఫస్ట్ డే 4.5 మిలియన్ల డాలర్లు కొల్లగొట్టిందని మరో వార్త వస్తోంది. దీంతో ఇప్పుడు అందరూ కబాలి వార్తలపై పెద్ద కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఏది నిజమో... ఏది రూమరో తెలియని సందిగ్ధంలో ఉన్నారు.
మరోవైపు కబాలి శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 200 కోట్లు సాధించవచ్చునని మరో కథనం చెప్పుకొచ్చింది. ఇక ఈ కథనాల సంగతి ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లలో రిలీజ్ అయిన కబాలి ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించడం నిజంగా రజనీ ది గ్రేట్ అనాల్సిందే. కబాలి కలెక్షన్లు రజనీ స్టామినాను చెప్పాయని ప్రముఖ బాలీవుడ్ హీరో అజయదేవగణ్ ప్రశంసించారు. ఇక రజనీ సినిమా రిలీజ్ అయ్యిందంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ హంగామానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కబాలిపై జోక్స్ - ఛలోక్తులు - పేరడీలు ఆన్ లైన్ లో జోరుగా హల్ చల్ చేస్తున్నాయి.
కబాలి సినిమా రిలీజ్‌కు ముందే ఆన్ లైన్ లో లీక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ వ్యక్తి ట్విట్టర్ లో స్పందిస్తూ కబాలి పైరసీ ప్రింట్ ను తాను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తే టోరంటో వెంటనే ఆన్ ఇన్ స్టాల్ అయ్యి - సిస్టం ఫార్మాట్ - వైఫై క్రాష్ అయ్యి - పక్కనే ఉన్న ఎయిర్ టెల్ టవర్ మాయమైందని చెప్పాడు.
ఇక కబాలి సినిమాను ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేయాలని అనుకుంటే ఓ వైరస్ బయటకు వచ్చి వాళ్ల చెంపచెల్లుమనిపించి వారిని కబాలి థియేటర్లో పడేస్తుందని కొందరు పేర్కొన్నారు. అన్ని సినిమాలు ముందు థియేటర్లో రిలీజ్ అయ్యి..తర్వాత టోరంటోలో లీక్ అయితే...కబాలి మాత్రం టోరంటోలో లీక్ అయ్యాక షూటింగ్ మొదలవుతుందని కొందరు చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కబాలి డిష్కర్షనే జరుగుతోంది.