Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ మొత్తం మార్చింది.. ముద్దు సీన్లకు పేరెంట్స్ ఓకే.. హీరోయిన్ జర్నీ
By: Tupaki Desk | 21 Dec 2020 5:30 PM GMT‘‘స్నేహితురాలు బుల్లితెరపైకి తోసింది.. బిగ్ బాస్ వెండితెరపైకి నడిపించారు.. అమ్మానాన్న నా వెన్నంటి నడిచారు..’’ అంటూ తన జర్నీ గురించి వివరించింది బాలీవుడ్ నటి హీనా ఖాన్. 11 ఏళ్ల క్రితం ‘యే రిష్‌తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా. ఆ తర్వాత బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘కేన్స్ ఫెస్టివల్’లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి ‘హ్యూమన్స్ బాంబే’తో పంచుకున్నారు హీనా ఖాన్. ఆ వివరాలు ఆమె మాటల్లోనే చూద్దాం...
‘నేను కాశ్మీరీ కుటుంబం నుంచి వచ్చాను, అక్కడ నటన అనే మాట నిషిద్ధం. కాలేజీ స్టడీస్ కోసం నన్ను ఢిల్లీ పంపేందుకు కూడా నా తల్లిదండ్రులు భయపడ్డారు. కానీ.. నాన్నను ఒప్పించి ఢిల్లీ వచ్చాను. ఆ సమయంలో ఓ సీరియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి నువ్వు వెళ్లు అని స్నేహితురాలు చెప్పింది. నేను నో చెప్పాను. కానీ తను పట్టువదల్లేదు. ఆ విధంగా తన బలవంతం మీద నేను ఆడిషన్‌కి వెళ్లాను. తర్వాతి రోజే నేను సెలక్ట్ అయినట్లు కాల్ వచ్చింది. తప్పని పరిస్థితుల్లో 20 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లాను. ఇక, నేను టీవీలో నటిస్తున్నాననే విషయం నాన్నతో చెప్పడానికి నాకు కొన్ని వారాల టైం పట్టింది.
బంధాలు తెగాయి..
నేను సీరియల్ లో నటించే విషయం వినగానే నాన్న షాక్ అయ్యారు. అమ్మ స్నేహితులు, బంధువులు మా కుటుంబంతో బంధాలు తెంచుకున్నారు. చివరకు ఎలాగోలా నాన్న కూడా అంగీకరించారు. కానీ.. చదువు కూడా కొనసాగించాలని కండిషన్ పెట్టారు. దాంతో బ్రేక్ టైంలో వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. ఆ తర్వాత అమ్మవాళ్లు ముంబైకి మారారు.
‘బిగ్‌బాస్’తో మొత్తం మారిపోయింది..
మొత్తం ఎనిమిది సంవత్సరాల పాటు సీరియల్‌లో కొనసాగాను. 2017లో బిగ్‌బాస్-11 ఆఫర్ వచ్చింది. అయితే.. సీరియల్స్‌లో నటించే సమయంలో నేను ‘షార్ట్స్ వేసుకోను.. అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించనని’ కండిషన్స్ పెట్టాను. కానీ.. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చేనాటికి నా సొంత నియమాలు రూపొందించుకున్నాను. ఇక మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూడ్డం ప్రారంభించారు. దీంతో.. నేను ప్రేమిస్తున్న రాకీ గురించి వారికి చెప్పాను. ఇది విని కుటుంబంలో అందరు షాక్ అయ్యారు. కానీ చివరకు ఒప్పుకున్నారు. ఇప్పుడు మా అమ్మనాన్న నా కంటే ఎక్కువ తననే ప్రేమిస్తారు.
సినిమాల్లోకి ప్రయత్నించాను..
‘ఇక టీవీ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న వేళ నేను ధైర్యం చేసి సినిమాల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాను. ఇక నా మొదటి చిత్రం గతేడాది జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికయ్యింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఆ తర్వాత ఓటీటీలోకి కూడా ప్రవేశించాను. అయితే.. స్క్రిప్ట్‌లో భాగంగా ముద్దు సీన్‌లో నటించాల్సి వచ్చింది. దీని గురించి అమ్మనాన్నలకు చెప్పాక వారు అర్థం చేసుకుని అంగీకరించారు. ఆ తర్వాతే ఆ సీన్‌కి ఓకే చెప్పాను.
ఈ జర్నీ ఊహించలేదు..
నేను మొట్టమొదట కెమెరాను ఎదుర్కొని 11 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీనగర్‌లో పుట్టిన చిన్నారి కేన్స్ వరకు జర్నీ చేయడం నిజంగా ఊహించలేదు. కానీ.. కఠినమైన నిర్ణయాలే నన్ను ఇక్కడ వరకు నడిపించాయి. నేను నటిగా మారడం నుంచి.. వేరే సమాజానికి చెందిన వారితో డేటింగ్ చేయడం వరకు నా స్వంత మార్గాన్ని నేనే ఏర్పాటు చేసుకున్నాను. ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలను’ అన్నారు హీనా ఖాన్.