Begin typing your search above and press return to search.

సౌత్ ఇండస్ర్టీలపై నార్త్ భామ చెత్త కామెంట్లు

By:  Tupaki Desk   |   27 Oct 2017 9:52 AM GMT
సౌత్ ఇండస్ర్టీలపై నార్త్ భామ చెత్త కామెంట్లు
X
దక్షిణాది సినిమాలపై పడి ఏడవడం అనే పాయింట్ ఈ మధ్యన నార్త్ లో బాగా ఎక్కువైపోయింది. ముఖ్యంగా అక్కడి రికార్డులు అన్నిటినీ బాహుబలి2 తుడిచేసిన తర్వాత.. ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. ఈ పాయింట్ రకరకాల యాంగిల్ లో వాడేసుకుంటున్నారు. హీనా ఖాన్ అనే టీవీ బ్యూటీ ఇప్పుడు సౌత్ సినిమాలపై సౌత్ ఇండస్ర్టీలపై చవకబారు వ్యాఖ్యలు చేసింది. అలాగని.. ఇవేమీ ఆమెకోసం చేసినట్లుగా కనిపించడం లేదు.

గతేడాదివరకూ హిందీకే పరిమితమైన బిగ్ బాస్ షోలు.. ఇప్పుడు సౌత్ లో కూడా వచ్చేశాయి. మంచి సక్సెస్ లు కూడా సాధించాయి. కానీ హిందీ బిగ్ బాస్ షోకు మాత్రం తెగ విమర్శలు వస్తున్నాయి. అసలే మాత్రం ఆకర్షణీయంగా లేదనే కామెంట్స్ ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసింది పార్టిసిపెంట్ హీనా ఖాన్. ఈమె వ్యాఖ్యల ప్రకారం.. సౌత్ సినిమాల్లో బాగా దిట్టంగా ఉంటేనే జనాలకు నచ్చుతారు. అంతే కాదు.. డ్యాన్సులు కూడా చాలా అసభ్యంగా ఉంటాయట. అసహ్యకరమైన మూమెంట్స్ చేయిస్తారట. అందుకే తనకు ఓ రెండు భారీ చిత్రాల ఆఫర్స్ వచ్చినా నటించలేదని చెప్పింది.

ఈమె చెప్పినవాటిలో ఒకదాంట్లో అయితే మహేష్ బాబు.. వెంకటేష్ హీరోలు. ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పకపోయినా అర్ధమయిపోతుంది లెండి. అయితే.. ఈ సినిమాలో చేయనందుకు మాత్రం ఇప్పటికీ ఫీలవుతూ ఉంటుందట హీనా ఖాన్. బిగ్ బాస్ లో క్రేజ్ కోసం.. ఇలా సౌత్ పై చెత్త కామెంట్లు ఏల భామ? సరే సౌత్ లో ఎందుకు.. నువ్వు బాలీవుడ్ లో హీరోయిన్ అయ్యి చూపించు!!