Begin typing your search above and press return to search.
యావరేజ్ గా గట్టెక్కిన టెంపర్ హిందీ రీమేక్
By: Tupaki Desk | 29 Dec 2018 4:46 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో 'టెంపర్' సినిమా చాలా ప్రత్యేకమైనది. ఆ సినిమా ముందు వరస ఫ్లాపులతో సతమతమవుతున తారక్ 'ఎన్టీఆర్' తో విజయం సాధించాడు. ఇక తన యాక్టింగ్ ను సాధారణ ప్రేక్షకులతో పాటుగా క్రిటిక్స్ కూడా కెరీర్ బెస్ట్ గా తేల్చేశారు. ఆ సినిమాను ఇప్పుడు హిందీలో లో 'సింబా' పేరుతో రీమేక్ చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రోహిత్ శెట్టి సినిమాలన్నీ మాస్ మసాలా ఎంటర్టైనర్లు. సౌత్ లో మాస్ సినిమాల స్టైల్ లో బాలీవుడ్ సినిమాలను తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్లలు సాధిస్తూ ఉంటాడు. ఈ 'టెంపర్' రీమేక్ కు పెద్దగా రివ్యూ రేటింగ్స్ రాలేదు. అందరూ యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టారు. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే 22 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం. కాంపిటీషన్ లో మరో సినిమా లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఇక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. యాజ్ యూజువల్ గా రణవీర్ తన రెగ్యులర్ స్టైల్ లో రచ్చ చేశాడట. ఈ సినిమాలో హీరోయిన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీఖాన్. ఈమధ్యే 'కేదార్ నాథ్' సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్ కు ఈ సినిమాలో పెద్దగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేంత అవకశం రాకపోయినా రణవీర్ కు జోడీగా మెప్పించిందని టాక్. ఓవరాల్ గా రీమేక్ వర్క్ అవుట్ అయినట్టే.