Begin typing your search above and press return to search.

అఖండను హిందీలో అలా చూపిస్తే రచ్చ ఖాయం!

By:  Tupaki Desk   |   7 Jan 2023 4:30 PM GMT
అఖండను హిందీలో అలా చూపిస్తే రచ్చ ఖాయం!
X
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఈనెల హిందీలో డబ్‌ అయ్యి విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే హిందీ వర్షన్ యొక్క ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ ను తెలుగు లో విడుదల అయిన సమయంలో ఎలా తీసుకు వచ్చారో అలాగే అక్కడ కూడా దించేశారు. కానీ హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మారిస్తే బాగుండేది.

ఈ మధ్య కాలంలో హిందీలో సూపర్‌ హిట్ అయిన సౌత్‌ సినిమాలను పరిశీలిస్తే ఏదైనా భక్తి సంబంధిత ఎలిమెంట్స్ ను చూపించడం జరిగింది. అందుకే అఖండ సినిమా కూడా అలాంటి భక్తిరస సినిమా అన్నట్లుగా ఉత్తర భారతంలో ప్రచారం చేస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు అయితే అఖండ హిందీ వర్షన్ కు పెద్దగా క్రేజ్ దక్కలేదు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. ఈ సమయంలో సినిమాలోని అఘోరాల సన్నివేశాలు మరియు శివుడికి సంబంధించిన సన్నివేశాలతో ఒక ట్రైలర్‌ ను విడుదల చేస్తే కచ్చితంగా అఖండపై బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది.

భారీ అంచనాలున్న వీర సింహారెడ్డి విడుదల అవ్వబోతున్న ఈ సమయంలో హిందీలో అఖండ సినిమా విడుదల అవ్వబోతుంది. అక్కడ మరియు ఇక్కడ ఒకే సారి బాలకృష్ణ సక్సెస్‌ లు దక్కించుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం అఖండ సినిమాను హిందీ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు పెన్ స్టూడియో వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కు పోటీగా హిందీ అఖండ విడుదల అవ్వబోతుంది. మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.