Begin typing your search above and press return to search.
వాళ్లకి మన సినిమాలు తెగ నచ్చేస్తున్నాయ్
By: Tupaki Desk | 8 March 2018 4:37 PM GMTచైనా... ఇండియాకు పచ్చగడ్డేస్తేనే భగ్గుమనేలా ఉంది బోర్డర్ దగ్గరి పరిస్థితి. చైనా సైనికులు సిక్కింలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించడం... మన వాళ్లు అడ్డుకోవడం... ఆ వీడియోలు వైరల్ అవ్వడం... అంతా జరిగిపోయింది. ఆఖరికి యుద్ధం వస్తుందేమో అన్నంత స్థాయికి చేరింది పరిస్థితి. ఇదంతా నాణానికి ఒకవైపు... మరో వైపు... చైనా వాళ్లకి మన సినిమాలంటే చెవికోసుకుంటున్నారు. విడుదలైన భారత సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి.
అమీర్ ఖాన్ సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ మన సినిమాలో విడుదలై పెద్దగా వసూలు చేయలేదు. కేవలం 64 కోట్ల రూపాయలతో సరిపెట్టుకుంది. గత ఏడాది ఆ సినిమాను చైనాలో విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా... 700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాలీవుడ్ కు ఆ ఫలితం నిజంగా షాక్ కొట్టేలాచేసింది. ఇంకేముంది చైనాలో సినిమా విడుదల చేయడానికి ముందే సిద్ధమై పోతున్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదలైన బజరంగీ బాయిజాన్ ను సల్మాన్ ఈ ఏడాది మార్చి 2న విడుదల చేశారు. దానిని బాగానే ఆదరిస్తున్నారు చైనా వాసులు. ఇప్పుడు మరో సినిమా విడుదలకు సిద్దం అయిపోతోంది.
ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా హిందీ మీడియం. గత ఏడాది ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ కొట్టింది. హిందీ మీడియం చదువులు... ఇంగ్లీషు మీడియం చదువుల మధ్య తేడాను చూపించిన సినిమా. అవార్డులు కూడా కొట్టింది ఈ సినిమా. దీనిని చైనాలో విడుదల చేసేందుకు సిద్దమైంది చిత్రయూనిట్. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఆ సినిమా విడుదల కానుంది. చైనాలో ఏమాత్రం వసూలు చేస్తుందో చూడాలి.