Begin typing your search above and press return to search.

ర‌ణ‌బీర్ త‌ర్వాత హిందీ పాన్ ఇండియా స్టార్..?

By:  Tupaki Desk   |   18 Oct 2022 10:31 AM GMT
ర‌ణ‌బీర్ త‌ర్వాత హిందీ పాన్ ఇండియా స్టార్..?
X
పాన్ ఇండియన్ ట్రెండ్ అంత‌కంత‌కు వేడి పెంచుతోంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఛేజిక్కించుకునేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ప్ర‌భాస్- రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఇప్ప‌టికే నిరూపించారు. మునుముందు బాలీవుడ్ లో కొంద‌రు యంగ్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్లో నిరూపించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇప్ప‌టికే ర‌ణ‌బీర్ క‌పూర్ బ్ర‌హ్మాస్త్ర చిత్రంతో విజ‌యం అందుకున్నాడు. ఈ సినిమా తెలుగులో ఆశించినంత‌గా ఆడ‌క‌పోయినా కానీ హిందీ బెల్ట్ లో ఘ‌న విజ‌యం సాధించింది. దేశంలో మెట్రో న‌గ‌రాల నుంచి చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు ర‌ణ‌బీర్- అయాన్ ముఖ‌ర్జీ- క‌ర‌ణ్ జోహార్ బృందం సీక్వెల్ పైనా దృష్టి సారిస్తున్నారు.

అయితే ర‌ణ‌బీర్ త‌ర్వాత బాలీవుడ్ నుంచి బ‌రిలో దిగుతున్న మ‌రో పాన్ ఇండియా యంగ్ హీరో ఎవ‌రు? అంటే క‌చ్ఛితంగా ధావ‌న్ బోయ్ అని ప్ర‌స్థావిస్తున్నారు. జూనియ‌ర్ స‌ల్మాన్ గా అత‌డికి ఉత్త‌రాది యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ సౌత్ వైపు అతడు అడుగులు వేయ‌లేదు. ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో తాను కూడా త‌న స్టార్ డ‌మ్ ని విస్త‌రించాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన తాజా చిత్రం'భేదియా'ను పాన్ ఇండియా రేంజులో విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలిసింది.

వరుణ్ ధావన్ - కృతి సనన్ జంట‌గా'భేదియా' ప్రకటించినప్పటి నుండి అందరి దృష్టి ఈ మూవీపైనే ఉంది. ఈ సినిమా ట్రైలర్ అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానుంది. అంత‌కుముందే ప్రీటీజ‌ర్ ఆక‌ట్టుకుంది. అప్పటి నుండి అభిమానులు సినిమా గురించి ఆస‌క్తిక‌రంగా చ‌ర్చిస్తున్నారు. ధావ‌న్ బోయ్ ఈ చిత్రంలో మునుపెన్న‌డూ క‌నిపించ‌ని ఒక కొత్త అవ‌తారంలో క‌నిపించ‌బోతున్నాడు. భేధియా క‌థాంశం కూడా యూనిక్ నెస్ తో ఆక‌ట్టుకోబోతోంది.

అంద‌రిలాగా క‌నిపించే అత‌డిలోని ఆ ర‌హ‌స్యం ఏమిట‌న్న‌దే అస‌లైన థీమ్ లైన్. ధావ‌న్ అభిమానుల ఉత్సాహాన్ని పెంచడానికి మేకర్స్ ఈ చిత్రం నుంచి మ‌రో కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. బ్ర‌హ్మాస్త్ర త‌ర్వాత భారీ వీఎఫ్ ఎక్స్ నేప‌థ్యంలో ఈ చిత్రం కూడా తెర‌కెక్కింద‌ని అర్థ‌మ‌వుతోంది.

తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో వరుణ్ ధావన్ భేదియా కొత్త పోస్టర్ ను షేర్ చేశాడు. పోస్టర్ ఎలివేష‌న్ ని బ‌ట్టి అత‌డు లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా థీమ్ చూస్తుంటే వాంపైర్ డైరీస్ త‌ర‌హా ప్ర‌యోగాన్ని త‌ల‌పిస్తోంది. వ‌రుణ్ ఇందులో ఒక జంతువు(తోడేలు) గా ట్రాన్స్ ఫామ్ అవుతుంటాడు. మ‌నుషుల్ని వెంబ‌డిస్తాడు. ఆకాశంలో నిండు పౌర్ణ‌మికి చంద్రుని చుట్టూ సంచ‌రించే గ‌బ్బిలాల‌కు అతడి జీవితానికి మ‌ధ్య ఉన్న లింకేంట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. హాలీవుడ్ లో ఈ త‌ర‌హా ప్ర‌యోగాలెన్నో ఇప్ప‌టికే అల‌రించాయి.

ఇప్పుడు భార‌తీయ తెర‌పై ఇలాంటి కొత్త జోన‌ర్ ని చూడ‌బోతున్నాం. బాహుబ‌లి- బ్ర‌హ్మాస్త్ర‌- ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలో సంబంధం లేకుండా పూర్తిగా వైవిధ్య‌మైన క‌థ‌ను ధావ‌న్ బోయ్ ఎంపిక చేసుకున్నాడు. రెసిడెంట్ ఈవిల్ త‌ర‌హా జాంబీ మూవీల‌తో ఇప్ప‌టికే ప్ర‌యోగాలు సాగినా కానీ'ది వాంపైర్ డైరీస్'..'ఉల్ఫ్ మేన్' త‌ర‌హా ప్ర‌యోగాలేవీ ఇండియ‌న్ స్క్రీన్ పై క‌నిపించ‌లేదు. కానీ ఇప్పుడు వ‌రుణ్ ధావ‌న్ అలాంటి కొత్త అటెంప్ట్ చేస్తున్నాడు. మ‌నుషుల మ‌ధ్య‌నే తిరుగుతూ ర‌క్తం తాగే తోడేలుగా అత‌డి ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ ని ఏ విధంగా క‌న్విన్స్ చేస్తారు? అనే దానిపై విజ‌యం ఆధార‌ప‌డి ఉంది. రియాలిటీ మిస్స‌యినా ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ ఇంపార్టెంట్.

వ‌రుణ్ ఇందులో టీ-షర్ట్ - జీన్స్ ధరించి దాడికి సిద్ధంగా ఉన్న వాంపైర్ లా క‌నిపిస్తున్నాడు. అంటే మోడ్ర‌న్ డే క‌నెక్టివిటీతోనే ఈ సినిమా సాగుతుంది. ఇందులో వరుణ్ కి ఒకవైపు చేతిలో టార్చ్ తో కృతి సనన్ క‌నిపిస్తోంది. ఈ పోస్టర్ లో దీపక్ డోబ్రియాల్- అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ''అబ్ హోగా జంగిల్ మే కాంద్!'' అని వరుణ్ రాశాడు. ఇక ఈ సినిమాతో ధావ‌న్ బోయ్ పాన్ ఇండియా స్టార్ గా విజ‌యం అందుకుంటాడా లేదా? అన్న‌ది వేచి చూడాలి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే వరుణ్ తదుపరి ఎక్కిస్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా'సాంకి'లో కనిపించనున్నాడు. అతను రాజ్ - DK దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం రస్సో బ్రదర్స్ గ్లోబల్ సిరీస్'సిటాడెల్' (ఇండియన్ వెర్ష‌న్‌) కూడా చేస్తున్నాడు.

కృతి ప్ర‌స్తుతం ప్రభాస్ -సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి'ఆదిపురుష్ 3డి'లో కనిపించనుంది. ఈ సినిమా టీజ‌ర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో పాటు విమర్శలకు కూడా గురైంది. అయితే ఈ సినిమాలో కృతి సీతాదేవి లుక్ అభిమానులను ఆక‌ర్షించింది. సంక్రాంతి బ‌రిలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.