Begin typing your search above and press return to search.
హిందీ ఉలవచారు బిర్యానీకి ఆరేళ్ల తర్వాత మోక్షం
By: Tupaki Desk | 4 Nov 2022 12:30 AM GMTతెలుగు తో పాటు పలు భాషల్లో నటించి విలక్షణ నటుడు అనే పేరు దక్కించుకున్న ప్రకాష్ రాజ్ తన అభిరుచికి తగ్గట్లుగా విభిన్నమైన సినిమాలను నిర్మించడం మరియు డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ముఖ్యంగా ఆయన నటించి దర్శకత్వం వహించిన ఉలవచారు బిర్యానీ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే.
ఉలవచారు బిర్యానీ సినిమాను హిందీలో స్వయంగా తడ్కా టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది. రీమేక్ కు దర్శకత్వం వహించడంతో పాటు సహ నిర్వాతగా కూడా ప్రకాష్ రాజ్ వ్యవహరించాడు. అయితే ఒరిజినల్ వర్షన్ లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. అయితే రీమేక్ లో మాత్రం ఆ పాత్రను బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ తో చేయించాడు.
తడ్కా సినిమాను 2016 సంవత్సరంలో ప్రకాష్ రాజ్ మొదలు పెట్టాడు. ఈ చిత్రంలో శ్రియ మరియు తాప్సి లు కీలక పాత్రల్లో నటించారు. సినిమా షూటింగ్ కార్యక్రమాలు నత్తనడకన సాగి ఏదోలా పూర్తి చేసినప్పటికి కూడా విడుదల విషయంలో అనేక ఇబ్బందులను ఈ సినిమా ఎదుర్కొంటూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధం చేయడం జరిగింది. థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ ద్వారా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ రీమేక్ ను జీ 5 ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. రేపటి నుండే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకు విడుదల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ దక్కేనా చూడాలి. శ్రియ మరియు తాప్సి లకు ఉత్తరాదిన మంచి క్రేజ్ ఉంది. కనుక వారు ఈ సినిమా తో మరోసారి ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.