Begin typing your search above and press return to search.

RRR: హిందూ- ముస్లిమ్ వివాదం?

By:  Tupaki Desk   |   15 March 2019 5:30 PM GMT
RRR: హిందూ- ముస్లిమ్ వివాదం?
X
ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ RRR వివాదాల్లోకి రాబోతోందా? ఈ సినిమాని హిందూ- ముస్లిమ్ ఫ్యాక్ట‌ర్ తో వివాదాల ర‌చ్చ‌లోకి లాగ‌నున్నారా? అంటే .. అవున‌నే జ‌క్క‌న్న మీడియా ఇంట‌రాక్ష‌న్ లో తేలింది. ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌తి సినిమాకి ఏదో ఒక వివాదం ముసురుకోవ‌డం ఖాయం. ఈగ‌, బాహుబ‌లి తో పాటు చాలా సినిమాల‌కు వివాదాలు త‌ప్ప‌లేదు. కాపీ క్యాట్ ముద్ర త‌ప్ప‌నిస‌రి అయ్యింది. ఈసారి ఆర్.ఆర్.ఆర్ వంతు. అయితే ఆర్.ఆర్.ఆర్ కి ఏ ఫ్యాక్ట‌ర్ వివాదానికి కార‌ణ‌మ‌వుతుంది? అంటే.. ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న విస్మ‌యం క‌లిగించింది.

ఏపీ, తెలంగాణ‌, ఉత్త‌రాదిని క‌లిపేస్తూ ఆర్.ఆర్.ఆర్ తీస్తున్నారు. ఇందులో హిందూ ముస్లిమ్ ఫ్యాక్ట‌ర్ కూడా ఉంది. అల్లూరి సీతారామ‌రాజు క్రిస్టియ‌న్లు అయిన ఆంగ్లేయుల‌తో పోరాడారు. అలాగే కొమ‌రం భీమ్ ముస్లిములు అయిన నైజాం రాజుల‌పై పోరాడారు. అంటే ఈ చిత్రంలో ముస్లిములు, క్రిస్టియ‌న్లు విల‌న్లు క‌దా? హిందూ వీరులు పోరాడేది వాళ్ల‌పైనే క‌దా? మ‌త‌ప‌ర‌మైన వివాదాలేవైనా చెల‌రేగేందుకు ఆస్కారం లేక‌పోలేదు క‌దా? అన్న పాయింట్ ని ఓ జ‌ర్న‌లిస్ట్ రెయిజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

తొలుత ఈ ప్ర‌శ్న అర్థం కాని జ‌క్క‌న్న ఆశ్చ‌ర్యంగా మొహం వెల్ల‌బెట్టారు. ఆ త‌ర్వాత త‌మాయించుకుని ఆంగ్లేయులు, నైజాం ల‌ను విల‌న్లుగా చూపిస్తున్న‌ది నిజ‌మే. అలాగ‌ని సినిమా తీయ‌కూడ‌దా? క‌థ‌ను క‌థ‌గా చూపించ‌కూడ‌దా? అని ఎదురు ప్ర‌శ్నించారు. అయినా ఇందులో హిందూ ముస్లిమ్ ఫ్యాక్ట‌ర్ ఏం ఉంది? అని సందేహం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. అస‌లు ఇందులో మ‌న్యం వీరుడైన అల్లూరి .. గిరిపుత్రుడైన కొమ‌రం భీమ్ ఇద్ద‌రూ వీరులు ఎలా అయ్యారు? అన్నంత వ‌ర‌కే క‌థ‌ను చూపిస్తున్నామ‌ని, వివాదాల‌కు ఎలాంటి ఆస్కారం లేద‌ని .. ఇది అంద‌రూ గ్ర‌హించాల‌ని రాజ‌మౌళి బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పారు. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ కి అస్స‌లు వివాదాల‌కు ఆస్కార‌మే లేద‌ని తేల్చి చెప్పారు. ఇక ఇదంతా మ‌న‌వాళ్లు ప‌ర్స‌న‌ల్ గా తీసుకుని క్రియేట్ చేసే వివాదాలేన‌ని ప‌క్క‌నే ఉన్న తార‌క్ కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.