Begin typing your search above and press return to search.
హిందూ మక్కల్ కట్చి సంచలన ప్రకటన!
By: Tupaki Desk | 8 Nov 2021 3:30 PM GMTఇటీవల తెలుగులో వచ్చిన `ఉప్పున` సినిమా విలన్.. తమిళ నటుడు విజయ్ సేతుపతి కేంద్రంగా హిందూ సంస్థ హిందూ మక్కల్ కట్చి సంచలన ప్రకటన చేసింది. ఆయనను తన్నిన వారికి డబ్బులు ఇస్తామని.. ప్రకటించింది. అంతేకాదు.. ఎవరైనా సరే.. ఎన్నిసార్లు విజయ్‌ను తంతే.. ప్రతి తన్నుకు రూ.1001 చొప్పున ఇస్తామని.. సంచలన ప్రకటన జారీ చేసింది. ఒకసారి అతనిని తన్నిన వారికి రూ. 1001 ఇస్తామని ఆ సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ నగదు బహుమతి ప్రకటించారు. ప్రస్తుతం ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. నిదానస్తుడు.. వివాద రహితుడుగా పేరున్న నటుడు విజయ్. అలాంటి నటుడు ఒక్కసారిగా.. జాతీయ స్థాయిలో వార్తగా మారిపోయారు. దీంతో అసలు ఏం జరిగింది..? ఎందుకీ వివాదం..? అనే చర్చ జరుగుతోంది.
అసలు ఏం జరిగింది?
విజయ్ సేతుపతి.. స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్య, దేశాన్ని అవమానించాడ ని హిందు మక్కల్ కట్చి ఆరోపించింది. దీనికి సంబంధించి తమ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్టు చేసింది. "తేవర్ అయ్యను అవమానించినందుకుగాను ఎవరైతే నటుడు విజయ్ సేతుపతిని తంతారో, ఒకసారి అతనిని తన్నిన వారికి రూ. 1001 ఇస్తా``మని ఆ సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ నగదు బహుమతి ప్రకటించారు. అంతేకాదు, విజయ్ సారీ చెప్పే వరకు దీనిని కొనసాగిస్తామని.. అర్జున్ స్పష్టం చేశారు.
అర్జున్ ఏమన్నారంటే..
ఈ విషయం మీద అర్జున్ సంపత్ మాట్లాడుతూ, తాను ఆ స్టేట్‌మెంట్ ఇచ్చానని, అది వైరల్ వీడియోకు సంబంధించినదని అంగీకరించాడు. విజయ్ సేతుపతిని తన్నడానికి ప్రయత్నించిన వ్యక్తి మహా గాంధీతో తాను మాట్లాడానని, సేతుపతి హేళనగా మాట్లాడాడని, అది వాగ్వాదానికి దారితీసిందని అర్జున్ సంపత్ అన్నారు. కాగా, ఈ వారం మొదట్లో నటుడు విజయ్ సేతుపతిని తన టీమ్ తో కలిసి బెంగుళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అయ్యింది. విజయ్ సేతుపతి ఈ సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేసినా, హిందూ మక్కల్ కట్చి దీనిని సీరియస్‌గా తీసుకోవడం గమనార్హం.
అంతేకాదు..
విజయ్ సేతుపతికి జాతీయ అవార్డు వచ్చినందుకు మహా గాంధీ శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఇది అస్సలు దేశం కాదు అని అన్నారట. దీంతో మహా గాంధీ అవాక్కయ్యారు, కానీ మీరు దక్షిణాది జిల్లాల నుండి వచ్చారు కాబట్టి ముత్తురామలింగ దేవర్ పూజ( తమిళ యోగి) పసుంపోన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. కానీ విజయ్ సేతుపతి మళ్లీ ప్రపంచంలోని ఏకైక తేవన్ (దేవుడు) జీసస్ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడని అర్జున్ అన్నారు. అయితే.. దీనిపై అటు తమిళనాడు ఇండస్ట్రీ కానీ.. నటుడు.. సేతుపతి కానీ.. ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.