Begin typing your search above and press return to search.
తెరపై కాసుల వర్షం కురిపిస్తున్న హిందుత్వ!
By: Tupaki Desk | 7 Nov 2022 7:30 AM GMTగతంలో పోలిస్తే సినిమాల విషయంలో ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. కరోనాకు ముందు ఎలాంటి సినిమాకైనా ఓపెనింగ్స్.. మినిమమ్ వసూళ్లు వచ్చేవి.. కాదనీ ఈ మధ్య ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో విప్లవాత్మక మార్పులు రావడంతో ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడం లేదు.. థియేటర్లలో రోజుల తరబడి ఆడటం లేదు. కేవలం కంటెంట్ వున్న సినిమాలరూ ప్రేక్షకులు ఈ రోజుల్లో బ్రహ్మరథం పడుతున్నారు.
స్టార్, తెలిసిన, దాశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో వున్న హీరోనా అని చూడటం లేదు. ఊరూ పేరు తెలియని వారు చేసిన సినిమా అయినా సరే అందులో ఆకట్టుకునే కంటెంట్ వుదంటే చాలు ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లనిముంచేస్తున్నారు. నచ్చిన సినిమాలపై ఊహించని విధంగా కాసుల వక్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మధ్య కంటెంట్ వున్న సినిమాలతో పాటు హిందుత్వకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కించిన సినిమాలని ప్రత్యేకంగా చూస్తూ కాసుల పంట పండిస్తున్నారు.
ఇటీవల హిందుత్వ నేపథ్యంలో రూపొందిన సినిమాలు దేశ వ్యాప్తంగా ఊహకందని విధంగా బ్లాక్ బస్టర్ హిటలు గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఆశ్చర్యపరిచాయిజ ఇవి సాధించిన వసూళ్లని చూసిన ట్రేడ్ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. ఇందులో ముందుగా కశ్మీర్ పండిట్ ల నరమేధం నేపథ్యంలో రూపొందిన సంచలన మూవీ 'ది కశ్మీర్ ఫైల్స్'. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషీ ప్రధాన పాత్రల్లో కేవలం రూ. 15 నుంచి 25 కోట్ల మధ్య బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.
పెద్దగా పేరున్న స్టార్స్ నటించకపోయినా.. ఓ డాక్యుమెంటరీ తరహా సినిమా అని ప్రచారం జరిగినా .. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలనాలు సృష్టించి షాకిచ్చింది. వరల్డ్ వైడ్ గా రూ.340 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలతో పాటు సినీ పండితుల్నే విస్మయానికి గురిచేసింది. దీనికి ప్రధాన కారణం సినిమాలోని హిందుత్వ. హిందువులపై జరిగిన ఆగడాలే. ఇక ఈ మూవీ తరువాత ఇదే స్థాయిలో సంచలనం సృష్టించిన మూవీ 'కార్తికేయ 2'. నిఖిల్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ 15 నుంచి 30 కోట్ల మధ్య తెరరెక్కింది.
అనూహ్యంగా పాన్ ఇండియా వైడ్ గా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టింది. ఉత్తరాదిలో అంటే హిందీ బెల్ట్ లో ఈ మూవీ ఏకంగా రూ.30 కోట్లు వసూళ్లని రాబట్టడం పలువురిని షాక్ కు గురిచేసింది. దేశ వ్యాప్తంగా ఊహించని విధంగా రూ. 120 కోట్లకు మించి వసూళ్లని దక్కించుకుంది. కారణం హిందుత్వ నేపథ్యంలో కృష్ణ తత్వం ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కించడమే. ఇక ఇదే పంథాలో రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' మూవీ కూడా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా వైడ్ గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
రూ. 16 కోట్లతో కన్నడలో రూపొందిన ఈ మూవీని ఐదు భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగులో ఈ మూవీ దాదాపు రూ. 40 కోట్ల వరకు వసూళ్లని రాబట్టడం.. అన్ని భాషల్లోనూ వరల్డ్ వైడ్ గా రూ. 325 కోట్లకు మించి కలెక్షన్ లని రాబట్టడంతో ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు, ఇతర ఇండస్ట్రీ జనాలు అవాక్కవుతున్నారు. భూతకోల ని పరిచయం చేస్తూ హిందుత్వ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించడమే. గ్రామీణ దేవతల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ రూపొందించిన ఈ మూవీకి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వున్నహిందువులు బ్రహ్మరథం పట్టారు.... అదే ఈ సినిమాని శిఖరాగ్రాన నిలబెట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టింది. ఈ మూడు సినిమాలు హిందుత్వకు అద్దంపడుతూ హిందువుల భావోద్వేగాలు, నమ్మకాలు, ఎమోషన్స్ నేపథ్యంలో రూపొందాయి గనకే వీటికి ఇంతటి ఆదరణ దక్కింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.