Begin typing your search above and press return to search.
కాలం ముందుకెళుతుంటే అతడి ఏజ్ వెనక్కి వెళుతోంది!
By: Tupaki Desk | 19 Feb 2021 11:10 AM GMTఇదంతా ఏడాదిలోనే.. ! మహేష్ అల్ట్రా స్మార్ట్ లుక్.. పర్ఫెక్ట్ ఫిట్ జిమ్ లుక్ కి ఈ టైమ్ సరిపోయిందిట. ఈ ఛేంజ్ కోసం 2019లో శిక్షణ ప్రారంభించాడు. ఇప్పటికి లుక్ పూర్తిగా ఇలా మారిపోయింది. గ్రేట్ మ్యాన్.. కాలం గడుస్తున్న కొద్దీ అతడి వయసు తగ్గిపోతోంది!! అంటూ కితాబిచ్చేశారు నమ్రత శిరోద్కర్. తాజాగా దుబాయ్ లో వర్కవుట్ సెషన్ ఫోటోని షేర్ చేసి మహేష్ హార్డ్ వర్క్ డెడికేషన్ పట్టుదల గురించి నమ్రత చెప్పిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. మహేష్ అభిమానులందరికీ ఇది స్ఫూర్తి. నమ్రత రాసుకొచ్చిన సుదీర్ఘ ఇన్ స్టా లేఖలో గుట్టంతా దాగి ఉందిలా.
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న `సర్కార్ వారి పాట` చిత్రీకరణ దుబాయ్ లో సాగుతున్నప్పుడు నేను గత నెలలో అక్కడే ఉన్నాను. మేము దుబాయ్ లో దిగిన రోజు నుంచి నేను ప్రతిరోజూ జిమ్ లో ఉన్నాను. కసరత్తులు చూస్తున్నాను.దుబాయ్ లో గత 30 రోజులుగా మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది. మా శిక్షణ లో బలం పెంచుకునేవి.. కార్డియో (వాయు రహిత) కసరత్తులు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని రెండుగా విభజించాం. షూట్ చివరిలో సాయంత్రాలలో మేము ఎక్కువగా శిక్షణ తీసుకున్నాం.
మహేష్ ప్రతి సెషన్ కి అటెండయ్యేందుకు ప్రయత్నించారు. అతను ఎడారిలో సెట్ లో సవాళ్లు ఎదురైనా క్రమం తప్పక వర్కవుట్లకోసం వచ్చారు. ఒకసారి అతను జిమ్ లోకి అడుగుపెట్టాక ఎంత కష్టమైనా చేస్తారు.ప్రతి వ్యాయామం సుమారు 60 నిమిషాల పాటు చేయాలి. ప్రతిరోజూ తనను తాను ముందుకు సాగేలా జాగ్రత్తగా ఉంటాడు. అతను ప్రతి వ్యాయామాన్ని క్రమశిక్షణతో చేస్తారు. దానికి 100 శాతం ఇస్తారు. సెట్లో అలానే బయటా గొప్ప పరిపూర్ణుడు.
ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను. మేము 2019 లో మొదటిసారి ప్రయత్నించాం. కోచ్ ని కలిసినప్పటి నుండి MB చాలా దూరం వచ్చారు. గాయాలతో పోరాడటం .. అధిగమించడం నుండి అటువంటి అద్భుతమైన ఆకారంతో సరైన కండిషనింగ్ లోకి రావడం చూస్తుంటే తన నిజాయితీ పట్టుదలకు ఇవే నిదర్శనం. కాలంతో పాటు బెటర్ అవుతూ వృధ్యాప్యాన్ని వెనక్కి నెట్టేస్తున్నాడు!.. అని ఆ సుదీర్ఘ నోట్ లో తెలిపారు. గ్రేట్....! సర్కార్ వారి పాట దుబాయ్ షెడ్యూల్ స్వింగ్ లో పూర్తి చేస్తున్న సంగతి తెలిసినదే. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.