Begin typing your search above and press return to search.

హిట్ 2 జనసేన గ్లాస్.. శేష్ ఏమన్నాడంటే!

By:  Tupaki Desk   |   23 Nov 2022 12:30 PM GMT
హిట్ 2 జనసేన గ్లాస్.. శేష్ ఏమన్నాడంటే!
X
అడివి శేష్ అలాగే పవర్ స్టార్ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ మొదట పంజా సినిమా ద్వారా కలిసి నటించారు. ఇక ఆ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా అందులో అడివి శేష్ నటించిన విధానం ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది.

అయితే ఆ సినిమా షూటింగ్లోనే అడివి శేషుకు పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు. అప్పటినుంచి కూడా అతను ఎంతో క్లోజ్ గా దగ్గరవుతున్నాడు.

ఇక ఇటీవల కాలంలో అయితే వారిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు హిట్టు 2 సినిమా పోస్టర్ పై అడివి శేష్ గాజు గ్లాస్ తో కనిపించడంతో అధి కాస్తా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అడివి శేష్ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అని ఓ వర్గం జనసేన అభిమానులు ప్రచారాలు మొదలుపెట్టేశారు.

ఇక ట్రైలర్ లాంచ్ లో కూడా అదే తరహా ప్రశ్న ఎదురవడంతో అడివి శేష్ చాలా సున్నితంగా ఆ విషయంపై స్పందించాడు. పోస్టర్లో జనసేన గ్లాసు కనిపిస్తోంది అని అందుకు కారణం ఏమిటి అని అడగడంతో నవ్వుతూ స్పందించిన అడివి శేషు తన ఇంటెన్షన్ అయితే అది కాదని ఓపెన్గా తెలియజేశాడు.

కానీ ఆకిరా, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నా హృదయానికి చాలా దగ్గరి వారు అని, వారు అంటే నాకు ఎప్పటికీ ఇష్టమే అని అందులో ఎలాంటి చర్చ అవసరం లేదు అన్నాడు. ఇక పోస్టర్లో కనిపించినట్లుగా జనసేనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఇక అడివి శేష్ ఆ విధంగా క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ గా మారింది. ఇక హిట్ 2 సినిమా డిసెంబర్ రెండవ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. నాని ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.