Begin typing your search above and press return to search.

హిట్ 2 మేజర్ ప్లాన్.. హిందీలో కూడా..

By:  Tupaki Desk   |   28 Dec 2022 10:38 AM GMT
హిట్ 2 మేజర్ ప్లాన్.. హిందీలో కూడా..
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సక్సెస్ అయిన సినిమాలకు హిందీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా కాలంగా అయితే యూట్యూబ్లో తెలుగు హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే అందుతుంది అందుకే మన సినిమా డబ్బింగ్ వెర్షన్లకు కోట్లల్లో డిమాండ్ అయితే ఏర్పడింది.

చిన్న తరహా హీరోల సినిమాలకు కూడా 100 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వస్తున్నాయి అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డిజాస్టర్ సినిమాలకు కూడా ఊహించని స్పందన వస్తోంది. అయితే ఇప్పుడు తెలుగులో సక్సెస్ అయిన సినిమాలను హిందీ థియేటర్లో కూడా విడుదల చేయాలని ఓ వర్గం నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇక కొందరు అయితే డైరెక్ట్ గా కూడా విడుదల చేస్తున్నారు.

ఇక ఇప్పుడు హిట్ 2 సినిమాను హిందీలో విడుదల చేయాలి అనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు హిట్ 1ను హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు హిట్ 2 టు సినిమాను డైరెక్ట్ గా హిందీలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

ఎందుకంటే ఇటీవల మేజర్ సినిమాతోనే అడివి శేష్ హిందీ మార్కెట్లో కూడా మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఆ సినిమా ఎమోషనల్ గా నార్త్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యింది. హిట్ 2 సినిమాను కూడా అదే క్రేజ్ విడుదల చేయాలని అనుకుంటున్నారు.

డిసెంబర్ 30వ తేదీన ఇటు హిందీ వెర్షన్ సినిమాను ప్రమోట్ చేసి మరి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నాని నిర్మించిన విషయం తెలిసిందే. తెలుగులో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.