Begin typing your search above and press return to search.
HIT 2: హీరోకు నాని ఇచ్చిన ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే
By: Tupaki Desk | 23 Nov 2022 9:33 AM GMTటాలెంటెడ్ హీరో అడివి శేష్ రెగ్యులర్ కమర్షియల్ తరహాలో కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. రైటర్ గా కూడా ఈ హీరో ఇప్పటికే కొన్ని సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఒక విధంగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు కూడా ఇతనితో సినిమాలను నిర్మించేందుకు పోటీపడుతున్నారు. ఆ విధంగా క్రేజ్ సంపాదించుకున్న అడవి శేష్ రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలతో అలరించబోతున్నాడు.
ముఖ్యంగా ఈ ఏడది మేజర్ సినిమాతో అతను కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. మహేష్ బాబు జిఎంబి ప్రొడక్షన్లో ఆ సినిమా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అంతకు ముందు వచ్చిన ఎవరు, గూడచారి, ఆమీతూమి, క్షణం సినిమాలు కూడా అతనికి మంచి గుర్తింపు అందించాయి. ఇలా వరుసగా సక్సెస్ అందుకుంటే అతని మార్కెట్ తో పాటు పారితోషికం కూడా పెరుగుతూనే వస్తోంది.
అయితే అతను మాత్రం ఎక్కువగా రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయకుండా కంటెంట్ మీద నమ్మకంతో ముందుకు వెళుతున్నాడు. దీంతో నిర్మాతలే అతని డిమాండ్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు అని చెప్పవచ్చు.
ఇక మేజర్ సినిమాకు శేష్ నాలుగు కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్నాడు. ఇప్పుడు నాని నిర్మించిన హిట్ 2 సినిమాకు ఏ స్థాయిలో అందుకొని ఉంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
తన రేంజ్ కు తగ్గట్టుగానే ఆ సినిమాకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఇప్పటివరకు అతనికి అదే అత్యధిక రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం హిట్ 2 సెకండ్ కేసు సినిమాకు అడవి శేష్ 5 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాపై నాని భారీ పెట్టుబడి పెట్టాడు. ఇక ట్రైలర్ అయితే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ రేంజ్ ను పెంచే విధంగా లాభాలను అందిస్తుంది అని చెప్పవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.