Begin typing your search above and press return to search.

'హిట్-3' సెట్స్ కి వెళ్లేది ఎప్పుడో తెలుసా?

By:  Tupaki Desk   |   25 March 2023 10:00 PM GMT
హిట్-3 సెట్స్ కి వెళ్లేది ఎప్పుడో తెలుసా?
X
క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్-హిట్-2` భారీ విజ‌యం సాధించ‌డంతో హిట్-3 పై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి. అందులోనూ నేచుర‌ల్ స్టార్ నాని నేరుగా రంగంలోకి దిగ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. రెండు భాగాలకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన నాని మూడ‌వ భాగంలోకి స్వ‌యంగా రంగంలోకి దిగ‌డంతో! అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

నాని సైతం ఆ ప్రాజెక్ట్ కోసం అంతే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం నాని `ద‌స‌రా` రిలీజ్ బిజీలో ఉన్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన అనంత‌రం ల్యాండ్ మార్క్ చిత్రం 30వ సినిమా ప‌నుల్లో బిజీ అవుతారు. ఈ సినిమాని నాని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆ సినిమాకి సంబంధించి ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

`ద‌స‌రా` రిలీజ్ అనంత‌రం టీమ్ తో పాటు నాని కూడా జాయిన్ అవుతారు. స్ర్కిప్ట్ ప‌క్కా రెడీ అయింద నుకుంటే? వెంట‌నే ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌నున్నారు. అలా కానీ ప‌క్షంలో స్ర్కిప్ట్ మ‌రింత గ్రౌండ్ జ‌రుగు తుంది. ఆ త‌ర్వాతే ఆన్ సెట్స్ కి వెళ్లేది. చిత్రీక‌ర‌ణ స‌హా రిలీజ్ చేసే స‌రికి ఆరు నెల‌లైనా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అలాగే `హిట్` ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను కూడా బిజీగానే ఉన్నారు.

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా `సైంధ‌వ్` ని తెరెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమా. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్త‌వ్వడానికి స‌మ‌యం ఎక్కువ‌గానే ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే సినిమా సెట్స్ ఉంది. కానీ రిలీజ్ తేదీ ప్ర‌కటించ‌లేదు. ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఉంది. శైలేష్ కొల‌ను ఔట్ పుట్ చెక్ చేసుకుని సంతృప్తి చెంద‌క‌పోతే అవ‌స‌రమ‌నుకుంటే రీషూట్ కి వెళ్తుంటారు.

త‌న మొద‌టి రెండు సినిమాల విష‌యంలో కొన్ని స‌న్నివేశాల‌కు సంబంధించి ఇలాగే జ‌రిగింది. వాటి రిలీజ్ వెనుక జాప్యానికి కార‌ణం ఇదేనని మీడియాలో ప్ర‌చారం సాగింది. కాబ‌ట్టి `సైంధ‌వ్` సినిమా ఎప్పుడు పూర్త‌వుతుంద‌న్నది ప‌క్కాగా చెప్ప‌లేని ప‌రిస్థితి . ఈ సినిమా వెంకీ 75వ సినిమా కావ‌డంతో మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. ఈ కోణంలో ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇవ‌న్నీ కొల‌మానం వేసి చూస్తే `హిట్-3` ఈ ఏడాది ప్రారంభం కావ‌డం క‌ష్ట‌మేనే వినిపిస్తుంది.