Begin typing your search above and press return to search.

HIT 3: ఈసారి ముగ్గురు మొనగాళ్ళు

By:  Tupaki Desk   |   22 Nov 2022 6:30 AM GMT
HIT 3: ఈసారి ముగ్గురు మొనగాళ్ళు
X
నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా ఫస్ట్ కేస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి కొనసాగింపుగా ఇప్పుడు సెకండ్ కేస్ హిట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలోని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తరువాత కొనసాగింపుగా మరిన్ని కథలు ముందుకు వెళతాయి అని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు.

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే హిట్ మూడవ కేసులో మొత్తం ముగ్గురు స్టార్స్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎవరు పాజిటివ్ రోల్స్ ఎవరు నెగిటివ్ రోల్స్ అనే విషయంలో క్లారిటీ రాలేదు కానీ తప్పకుండా ముగ్గురు పవర్ఫుల్ నటులు కనిపించబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అడవి శేష్ అయితే మూడవ కేసులో కూడా కనిపించబోతున్నాడు.

ఇక నాని కూడా అందులో ఒక పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో తమిళ హీరో విజయ్ సేతుపతిని కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. క్యారెక్టర్ బలంగా ఉంటే విజయ్ సేతుపతి పాజిటివ్ నెగిటివ్ అని తేడా చూడడు. కంటెంట్ కనెక్ట్ అయితే అతను సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. అది విలన్ పాత్ర అయినా కూడా అతను ఇష్టంగానే చేస్తాడు. కానీ హిట్ 3 కథ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతటి భారీ స్టార్ క్యాస్ట్ తోడైతే మాత్రం తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే HIT 3 సినిమా వస్తుంది అని చెప్పవచ్చు. కానీ ముందుగా ఇప్పుడు హిట్ 2 సెకండ్ కేసు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితేనే మళ్ళీ మూడవ సినిమాకు భారీ స్థాయిలో నిర్మించడానికి బలం చేకూరుతుంది. నాని కూడా మరొక నిర్మాతతో కలిసి హిట్ 3 సినిమాను తెరపైకి తీసుకురావచ్చు అని తెలుస్తోంది. మరి దర్శకుడు శైలేష్ ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.