Begin typing your search above and press return to search.
ఓకే రోజు బిగ్ హిట్ .. బిగ్ ఫ్లాప్
By: Tupaki Desk | 14 May 2022 1:30 PM GMTఒకే రోజు ఒకే హీరో నటించిన రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి కుంభస్థలాన్ని కొట్టేస్తే మరొకటి అధఃపాతాళాన్ని చేరి డిజాస్టర్ గా పిలిచింది. ఈ రెండు చిత్రాలు ఒకేసారి ఒకే రోజు పోటీపడుతున్నాయి. అయితే అది థియేటర్లలో కాదు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో. వివరాల్లోకి వెళితే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కెరీర్ లోనే అత్యంత భారీ హిట్ గా నిలిచి ఈ ఇద్దరిని పాన్ ఇండియా స్టార్లుగా నిలబెట్టింది. 1100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి తెలుగు సినిమా సత్తాని యావత్ ప్రపంచానికి చాటింది.
చరణ్ పెర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టేలా చేశాయి. ఈ మూవీతో చరణ్, ఎన్టీఆర్ ల కెరీర్ కు మరింత జోష్ మొదలైంది. దేశ వ్యాప్తంగా వీరికి ఈ సినిమాతో ప్రత్యేక గుర్తింపు లభించింది.
మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో చరణ్ కు ప్రశంసలు దక్కాయి. 'జంజీర్'తో కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ ఈ సినిమాతో దక్కించుకున్నాడు. ఎన్టీఆర్ ని కూడా బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్ లు పొగడ్తల్లో ముంచెత్తారు. ఇదిలా వుంటే ఈ సినిమాతో వచ్చిన మైలేజీకి 'ఆచార్య' పెద్ద గండి కొట్టింది. మెగాస్టార్ చిరంజీవి తో కలిసి చరణ్ తొలిసారి చేసిన ఈ సినిమా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందించకపోగా భారీ డిజాస్టర్ గా మారింది.
ఒకే సమయంలో పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్, భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్న హీరోగా చరణ్ నిలిచారు. అయితే ఈ రెండు చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఒకే రోజు స్ట్రీమింగ్ అవుతుండటం వండర్ గా మారింది. ట్రిపుల్ ఆర్ మే 20న ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.
అదే రోజు 'ఆచార్య' అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. ఇలాంటి ఒక రోజు వస్తుందని, తను నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతాయని ఊహించి వుండడు. ఇలా ఒకే రోజు బ్లాక్ బస్టర్ హిట్, డిజాస్టర్ మూవీల స్ట్రీమింగ్ కి సిద్ధమైన హీరో బహుషా రామ్ చరణ్ ఒక్కరే నేమో అంటున్నారు.