Begin typing your search above and press return to search.

గూగుల్ కంటే గ్రేట్ సల్మాన్ ఖాన్

By:  Tupaki Desk   |   11 Dec 2015 2:46 PM GMT
గూగుల్ కంటే గ్రేట్ సల్మాన్ ఖాన్
X
డ్రైవర్ లేకుండా నడిచే కారుపై గూగుల్ ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇప్పటికే చాలా చోట్ల టెస్టింగ్ కూడా నిర్వహిస్తోంది. ఈ కారుని 2020లో కమర్షియల్ రిలీజ్ చేయాలన్నది గూగుల్ ఆలోచన. అయితే.. ఇప్పుడు అంత అవసరం లేదని.. సల్మాన్ ఖాన్ 2002 లో డ్రైవర్ లెస్ కార్ కనిపెట్టేశాడంటున్నారు ట్విట్టర్ జనాలు.

2002 హిట్ అండ్ రన్ కేసులో.. సల్మాన్ ఖాన్ నేరం చేశాడనేందుకు సాక్ష్యాలు లేవని బాంబే హైకోర్టు తేల్చేసింది. సల్మాన్ ఉన్న అభియోగాలన్నిటినీ కొట్టేయడంతో.. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి మరణం, 4గురు గాయాలకు కారణం ఎవరనే టాపిక్, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బహుశా కారే తాగేసి ఉంటుందని కొందరు అంటున్నారు. ఆ యాక్సిడెంట్ జరిగినపుడు సల్మాన్ డ్రైవింగ్ చేశాడనేందుకు సాక్ష్యం లేదన్నది కోర్ట్ వాదన.

ఎవరికీ శిక్ష పడలేదంటే.. అది ఖచ్చితంగా డ్రైవర్ లేని కారే అయ్యుంటుందని, ఆ కారే తాగేసి ఒక వ్యక్తిని చంపేసి ఉంటుందని జోక్స్ పేలుతున్నాయి. పనిలో పనిగా డ్రైవర్ లెస్ కారుపై గూగుల్ చేస్తున్న ప్రయోగం ఇక అనవసరం అని.. ఇప్పటికి 13 ఏళ్ల కిందటే సల్మాన్ ఖాన్ డ్రైవర్ అవసరం లేని కారును ఉపయోగించాడంటున్నారు.

కోర్టు తీరు, సంఘటనలోని సీరియస్ నెస్ ని అలా చెప్పుకుంటున్నా.. ఒక వ్యక్తి మరణాన్ని ఇలా వదిలేయడం బాధాకరమైన విషయమే. కింది కోర్ట్ ఇచ్చిన ఐదేళ్ల జైలు శిక్ష రద్దయిపోవడంతో.. ఇప్పుడు సల్మాన్ ఊపిరి పీల్చుకున్నాడు.