Begin typing your search above and press return to search.

వెంకటేష్ కోసం హిట్ డైరెక్టర్ క్రేజీ ప్లాన్

By:  Tupaki Desk   |   15 Jan 2023 1:30 AM GMT
వెంకటేష్ కోసం హిట్ డైరెక్టర్ క్రేజీ ప్లాన్
X
హిట్ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ కుర్ర దర్శకుడు మొదటి రెండు సినిమాల సక్సెస్ తో ఇప్పుడు ఏకంగా విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ని సొంతం చేసుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇక దర్శకుడు శైలేష్ ఈ సారి కూడా తనకి భాగా అలవాటైన కాప్ స్టొరీనే వెంకటేష్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఘర్షణ తర్వాత వెంకటేష్ సీరియస్ పవర్ ఫుల్ కాప్ రోల్ లో ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించలేదు. బాబు బంగారం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన కూడా అది ఫుల్ ఫన్ రోల్. ఈ నేపధ్యంలో శైలేష్ కొలను సీరియస్ మోడ్ లో సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కాప్ స్టొరీని వెంకటేష్ కి నేరేట్ చేసి ఒప్పించినట్లు తెలుస్తుంది. ఇక ఈ కథ వెంకటేష్ కి కూడా భాగా నచ్చేయడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ గానే పట్టాలు ఎక్కించే పని మొదలు పెట్టారు.

వెంకటేష్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ని దర్శకుడు శైలేష్ కొలను స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా వెంకటేష్ కోసం హీరోయిన్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఈ మూవీలో ఒక హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మొదటి తెలుగు సినిమా కావడం, అది కూడా వెంకటేష్ లాంటి స్టార్ హీరోకి జోడీగా పడటంతో శ్రీనిధి శెట్టి వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఇక సెకండ్ లీడ్ రోల్ కోసం ఓ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఓ ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వెంకటేష్ తో శైలేష్ చేస్తున్న ప్రాజెక్ట్ హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కుతుందని కొందరు చెబుతూ ఉంటే, కాదని మరికొంత మంది అంటున్నారు.

వెంకటేష్ కెరియర్ లో 75వ సినిమాగా రాబోతున్న మూవీ కావడంతో దీనిని సురేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నట్లుగా సమాచారం. మరి సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు ఎవరిని ఎంపిక చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.