Begin typing your search above and press return to search.

హిట్ అయిన వివాదాస్పద సినిమా ఓటీటీ కి రెడీ

By:  Tupaki Desk   |   27 May 2022 12:30 PM GMT
హిట్ అయిన వివాదాస్పద సినిమా ఓటీటీ కి రెడీ
X
విశ్వక్‌ సేన్ హీరోగా రుక్సన్‌ దిల్లాన్‌ హీరోయిన్ గా రూపొందిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మంచి టాక్‌ ను దక్కించుకుంది. విశ్వక్‌ సేన్ ఖాతాలో మరో సక్సెస్‌ అంటూ రివ్యూలు వచ్చాయి. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం తో పాటు ఇలాంటి విభిన్నమైన సినిమాలే తెలుగు ప్రేక్షకులకు కావాలంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు.

థియేటర్ లో చూడలేని వారు ఇప్పుడు ఓటీటీ లో చూడటం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తక్కువ సమయంలోనే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ కు సిద్దం చేశారు.

ఈ నెల 6వ తారీకున విడుదల అయిన ఈ సినిమాను వచ్చే నెల 3వ తారీకున ఆహా లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. నాలుగు వారాలు పూర్తి అవ్వబోతున్న నేపథ్యంలో ఆహా స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది.

విశ్వక్‌ సేన్ చాలా విభిన్నమైన లుక్ లో కనిపించిన ఈ సినిమా ప్రమోషన్‌ సందర్బంగా కాస్త హడావుడి అయిన విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్‌ కోసం అన్నట్లుగా రోడ్డు మీద ఒక ఫ్రాంక్ వీడియో చేయడంతో అది కాస్త వివాదాస్పదం అయ్యింది. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌ లో దాని గురించి చర్చిస్తున్న సమయంలో హీరో విశ్వక్‌ సేన్ వెళ్లడంతో రచ్చ మరింత పెద్దగా అయ్యింది.

స్టూడియో లో ఆగ్రహంతో విశ్వక్‌ సేన్ వ్యవహరించిన తీరుతో రచ్చ మరింత ఎక్కువ అయ్యింది. ఆ వివాదం వల్ల కూడా సినిమాకు మరింతగా పబ్లిసిటీ దక్కినట్లు అయ్యింది. వివాదాస్పద సినిమా గా పేరు దక్కించుకున్న అశోక వనంలో అర్జున కళ్యాణం కు హిట్ టాక్ రావడంతో ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూశారు.

ఈ సినిమాకు వసూళ్లు కూడా చాలా బాగా వచ్చాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. చిన్న సినిమా గా విడుదల అయినా కూడా మంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చి మంచి వసూళ్లు నమోదు అయినట్లుగా టాక్‌ వచ్చింది. విశ్వక్‌ సేన్‌ ఈ సినిమా తో ఆహా లో కూడా ఖచ్చితంగా ఎంటర్‌ టైన్ చేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.