Begin typing your search above and press return to search.

HIT వీడియో: కాప్ విశ్వ‌క్ ప‌క్కా ప్రొఫెష‌న‌ల్

By:  Tupaki Desk   |   25 Feb 2020 6:15 AM GMT
HIT వీడియో: కాప్ విశ్వ‌క్ ప‌క్కా ప్రొఫెష‌న‌ల్
X
కాప్ స్టోరీలు ఎన్ని వ‌చ్చినా ఇంకా వ‌స్తూనే ఉంటాయి. పోలీస్ క‌థ‌ల్లో ఉండే ఎమోష‌న్ అలాంటిది. గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన రాఘ‌వ‌న్ .. ఘ‌ర్ష‌ణ చిత్రాల్లో ఎమోష‌న్ గురించి ఇప్ప‌టికి అభిమానులు మాట్లాడుతూ ఉంటారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ ఎంచుకుని ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించ‌డంలోనూ ఉంటుంది మ‌జా. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఈ జాన‌ర్ లో రిపీటెడ్ గా సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి.

ఆ కోవ‌లోనే మ‌రో ప్ర‌య‌త్నం హిట్. `ఫ‌ల‌క్ నుమా దాస్` ఫేం విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో పోలీస్ పాత్ర‌లో నటిస్తున్నారు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో హీరో నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా హిట్ లో ఓ పూర్తి సీన్ ని విజువ‌ల్ గా చూపించేసింది నాని టీమ్. మేకింగ్ లో స్టైలిష్ నెస్ ని ఎలివేట్ చేసింది ఈ వీడియో. ఒక మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేష‌న్. చ‌నిపోయిన బాడీని వెత‌కాలి. కానిస్టేబుల్స్ ఎంత వెతికినా క‌నిపెట్టేయ‌డం ఈజీనా? పోలీస్ అంటే వాస‌న ప‌సిగ‌ట్టేసేవాడు. మెద‌డు ఉప‌యోగించి జాడ ప‌ట్టేయాలి. డాగ్స్ సైతం క‌నిపెట్ట‌ లేనిది క‌నిపెట్టి ద‌ర్యాప్తు ను ముగించాలి.

అందుకు సంబంధించిన సీన్ ని ఎంతో డీసెంట్ గా తెర‌కెక్కించారు. ఇక ఈ సీన్ లో విశ్వక్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. పోలీసాఫీస‌ర్ గా అత‌డి లుక్ .. ఆహార్యం మైమ‌రిపించాయి. ఎంతో స‌హ‌జ‌సిద్ధంగా స‌న్నివేశాన్ని తెర‌కెక్కించ‌డం లో శైలేష్ ప‌నిత‌నం ఆక‌ట్టుకుంది. ఇన్వెస్టిగేష‌న్ సీన్ పండింది స‌రే కానీ.. ఇంతే గ్రిప్పింగ్ గా సినిమా ఆద్యంతం క‌ట్టి ప‌డేస్తుందా? అన్న‌ది థియేట‌ర్ల‌లోనే చూడాలి. విశ్వ‌క్ ఆశ‌ల‌తో పాటు నాని- శైలేష్ ఎంతో హోప్ తో తీసిన ఈ చిత్రం ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి. ఈ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 28) ఈ సినిమా రిలీజ్ కానుంది.