Begin typing your search above and press return to search.
మండే ఎండల్లో హిట్స్ ఫట్స్
By: Tupaki Desk | 5 May 2019 1:30 AM GMTఏప్రిల్ ఎండల్లో.. పరీక్షల హడావుడిలో ఎన్ని సినిమాలు రిలీజయ్యాయి? రిలీజైన వాటిలో ఏది హిట్టు? ఏది ఫట్టు? అన్నది లెక్కలు తీస్తే తెలిసిన ఆసక్తికర సంగతులివి. గత నెలలో 11 స్ట్రెయిట్ సినిమాలు రిలీజైతే అందులో మూడు హిట్లు కొట్టాయి. మిగతావన్నీ ఫ్లాప్ లుగా నిలిచాయి. వీటితో పాటు తొమ్మిది డబ్బింగ్ సినిమాలు రిలీజైతే అందులో రెండు విజయాలు దక్కించుకున్నాయి. నాగచైతన్య - మజిలీ (5ఏప్రిల్).. సాయిధరమ్ తేజ్ - చిత్రలహరి (12 ఏప్రిల్).. నాని- జెర్సీ (19 ఏప్రిల్) సినిమాలు విజయాల్ని సొంతం చేసుకున్నాయి. అయితే వీటిలో మజిలీ బ్లాక్ బస్టర్ హిట్. చిత్రలహరి అబౌ యావరేజ్.. జెర్సీ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. ఆడియెన్ మెప్పు పొందినా కలెక్షన్స్ పరంగా స్లో ఫేస్ లో వెళ్లడం చర్చకు వచ్చింది. ఇక ఊహించని పిడుగులా డబ్బింగ్ సినిమా `కాంచన 3` `జెర్సీ`కి పోటీగా దిగడంతో ఆ ప్రభావం క్లాసిక్ జెర్సీ పై తీవ్రంగానే పడిందని ట్రేడ్ విశ్లేషించింది. జెర్సీకి దక్కాల్సిన మాస్ వసూళ్లను కాంచన షేర్ చేసుకుందని విశ్లేషించారు.
రిలీజైన స్ట్రెయిట్ సినిమాల్లో ప్రేమ కథా చిత్రమ్ 2.. ప్రశ్నిస్తా.. రుణం .. దిక్సూచి.. దుప్పట్లో మిన్నాగు.. డేంజర్ లవ్ స్టోరి .. చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఈ సినిమాలకు సరైన ప్రచారం లేకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమాల కథతో తీసిన `ఉద్యమ సింహం` చిత్రాన్ని యూట్యూబ్ రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలే ప్రకటించారు. మజిలీ.. చిత్రలహరి.. జెర్సీ చిత్రాలు రెండో వారం మూడో వారంలోనూ థియేటర్లలో ఆడుతుండడంతో ఆ ప్రభావం ఇతర రిలీజ్ లపై కనిపించింది.
డబ్బింగ్ సినిమాల్లో.. సంజనా రెడ్డి.. షాజమ్.. లూసిఫర్.. సాహస పుత్రుడు.. రోధించే మహిళ.. 90 ఎంఎల్.. యమలోకం చిత్రాలు రిలీజయ్యాయి. వీటన్నిటి మధ్యా రిలీజైన లారెన్స్ మాస్టార్ `కాంచన- 3` మాస్ కి కనెక్టవ్వడంతో బాక్సాఫీస్ వసూళ్ల పరంగా సవారీ చేసింది. దీనికి తోడు చాలా ముందు నుంచే ప్రచారార్భాటంతో దూసుకొచ్చిన `అవెంజర్స్- ఎండ్ గేమ్` ఉరుములా మీద పడింది. ఈ సినిమా ఇండియా లెవల్లో అద్భుత వసూళ్లను సాధిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఆ మేరకు వసూళ్లు బావున్నాయని ట్రేడ్ చెబుతోంది. డబ్బింగుల్లో కాంచన- 3.. అవెంజర్స్ మాత్రమే బాక్సాఫీస్ వద్ద నిలబడ్డాయన్నది రిపోర్ట్.