Begin typing your search above and press return to search.

ఏపీలో పాత రేట్ల‌ టిక్కెట్టుతో రికార్డులు కొట్టేది!

By:  Tupaki Desk   |   30 Sep 2021 7:31 AM GMT
ఏపీలో పాత రేట్ల‌ టిక్కెట్టుతో రికార్డులు కొట్టేది!
X
నాగ చైత‌న్య-సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన `ల‌వ్ స్టోరీ` ఈనెల 24న రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో సినిమా నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్ల‌బ్ లో చేరింది. అన్ని ఏరియాల నుంచి భారీగా షేర్ల‌ను రాబ‌ట్టింది. గులాబ్ తుఫాన్ ని సైతం ప‌క్క‌కు నెట్టి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ల‌వ్ స్టోరీకి పోటీగా మ‌రో చిత్రం కూడా లేక‌పోవ‌డంతో కాసుల వ‌ర్షం కురిసింది. శేఖ‌ర్ క‌మ్ములా మార్క్ చిత్రంగా వెలిగిపోయింది. చై న‌ట‌న‌..సాయి ప‌ల్ల‌వి క్రేజ్ సినిమాని పీక్స్ కి తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమా వ‌సూళ్లు ఐద‌వ రోజు ఫ‌ర్వాలేద‌ని స‌మాచారం.

ఐద‌వ రోజున ఏపీ-తెలంగాణ నుంచి ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్లను తెచ్చింద‌ని స‌మాచారం. ఈ శుక్ర‌వారం సాయితేజ్ న‌టించిన `రిప‌బ్లిక్ ` కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా గ‌నుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే `ల‌వ్ స్టోరీ` వ‌సూళ్ల పై కొంత ప్ర‌భావం ఉండొచ్చు. `ప్రస్థానం` ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి కావాల్సినంత ప్ర‌చారాన్ని చేసిపెట్టారు. ఆ ర‌కంగా సినిమా జ‌నాల్లోకి బాగా వెళ్లింది. అయితే దేవ‌క‌ట్టా సినిమాలు క‌మ‌ర్శియ‌ల్ ఎలిమెంట్స్ దూరంగా ఉంటాయి.. సినిమా లో అలాంటి అంశాలు లోపిస్తే గ‌నుక మ‌ళ్లీ ల‌వ్ స్టోరీ పుంజుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. ఏదైనా రిలీజ్ త‌ర్వాత గాని సంగతేంటి? అన్న‌ది తేల‌దు.

మ‌రి` ల‌వ్ స్టోరి`కి వాస్త‌వంగా ఏపీలో క‌లెక్ష‌న్స్ ఇంకా పెద్ద రేంజులో క‌న‌ప‌డాల్సింది. అక్క‌డ స‌వ‌రించిన ధ‌ర‌లు పెద్ద స‌మ‌స్యాత్మ‌కం అయ్యాయి. నైజాంలో అందుకు భిన్న‌మైన వ‌సూళ్లు ధ‌ర‌ల వ‌ల్ల క‌నిపించాయి. ఇప్ప‌టికీ ల‌వ్ స్టోరీపై ప్రేక్ష‌కుల్లో క్రేజు త‌గ్గ‌లేదు. సెల‌వు దినాల వ‌ర‌కూ ఆడిస్తే త‌ప్ప‌కుండా క‌లెక్ష‌న్లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

బ్లాక్ టికెటింగ్ ప్ర‌భావం ఎంత‌?

కొన్నిచోట్ల‌ ఏపీలో థియేట‌ర్ యాజ‌మాన్యాలు 70 రూపాయ‌ల టిక్కెట్ల‌ను బ్లాక్ లో అమ్మ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ ఒక్కో టిక్కెట్ ని 200 నుంచి 500 మ‌ధ్య ధ‌ర‌ల‌కు బ్లాక్ లో అమ్మారని ప్రేక్ష‌కుల‌కు చెబుతున్నారు.. మ‌రికొన్ని ఏరియాల్లో అంత‌కు మించి రేటుతో విక్ర‌యించారు. మొద‌టి రోజు ఈ బ్లాక్ మార్కెట్ బిజినెస్ ఓ రేంజ్ లో జ‌రిగింది. అటుపై చాలా థియ‌ట‌ర్లు స్పాట్ విక్ర‌యాలు లేకుండా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేసారు. అంటే టిక్కెట్లు అప్ప‌టికే త‌మ‌కి కావాల్సిన రేటుకు అమ్ముకుని ప్రేక్ష‌కుడికి మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు అమ్ముకోండ‌ని బ్లాక్ బుబుల చేతుల్లో టిక్కెట్లు పెట్టేసారని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఓ నాలుగు రోజుల పాటు ఆ దందా జోరుగా కొన‌సాగిన‌ట్లు స‌మాచారం. ఈలోపు ప‌వ‌న్-మంత్రుల వేడి మొద‌ల‌వ్వ‌డం.. ఇక ఐద‌వ రోజున మంత్రి నాని స‌మ‌క్షంలో సినీ నిర్మాత‌లు భేటి అవ్వ‌డంతో సీన్ మారింది. నేరుగా థియేట‌ర్ల వ‌ద్ద టిక్కెట్ విక్ర‌యాలు జ‌రిగిన‌ట్లు సాక్షులు చెబుతున్నారు.