Begin typing your search above and press return to search.
సెలవులని సరిగ్గా వాడుకుంటారా?
By: Tupaki Desk | 4 Jan 2018 9:54 AM GMTసంక్రాంతి సెలవులు.. సినిమాలకు సూపర్బ్ సీజన్. గతేడాది ఈ సీజన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయంటే.. సంక్రాంతికి సినిమాలకు ఎంతటి కనెక్షన్ ఉందనే సంగతి అర్ధమవుతుంది. ఇప్పుడు కూడా సంక్రాంతి రేసులో నాలుగు పందెంకోళ్లు నిలిచాయి. పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి రిలీజ్ ఉన్నా.. మరో మూడు సినిమాలు షెడ్యూల్ అయ్యాయంటేనే.. ఈ పండుగపై మూవీ మేకర్స్ లో ఉన్న నమ్మకం అర్ధమవుతుంది.
మరి ఈ సీజన్ ను ఎవరు వాడుకుంటారనేదే ఇప్పుడు అసలు పాయింట్. జనవరి 11 నుంచి 17వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాలిడేస్ ఇచ్చేశారు. అంటే వారం రోజుల పాటు సినిమా హాల్స్ ఫుల్స్ అయిపోతాయన్న మాట. ఈ సీజన్ ను పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో స్టార్ట్ చేస్తున్నాడు. జనవరి10న విడుదల అవుతున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 7 రోజుల సెలవులతో కలిపి పవన్ కు మొత్తం 8 రోజుల పాటు థియేటర్లను దున్నేసే అవకాశం లభిస్తోంది. ఇంతటి లాంగ్ హాలిడే పీరియడ్ కారణంగా.. కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. మరోవైపు బాలకృష్ణ జై సింహా.. జనవరి 12న వస్తోంది. ఈ చిత్రం కూడా బోలెడన్ని ఓపెనింగ్స్ సాధించవచ్చని అంటున్నారు.
మరోవైపు సూర్య నటించిన గ్యాంగ్.. రాజ్ తరుణ్ మూవీ రంగుల రాట్నం కూడా ఇదే సీజన్ లో వస్తున్నాయి. ఈ నాలుగు సినిమాలలో సంక్రాంతి సెలవులను కరెక్ట్ గా వాడుకునేది ఎవరో చూడాలి. అడ్వాంటేజ్ ఉంది.. కాసింత కంటెంట్ ఉంటే చాలు.. కలెక్షన్స్ కుమ్మేయచ్చంతే.