Begin typing your search above and press return to search.
మహాభారతానికి హాలీవుడ్ సోకులు
By: Tupaki Desk | 14 July 2017 6:03 AM GMTమోహన్ లాల్ ప్రధాన పాత్రలో మహా భారత కావ్యాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రండమూఝం అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో.. భీముడి పాత్రలో మోహన్ లాల్ నటించబోతున్నారు. భీముడి కోణంలోనే మహాభారత కథ నడవడమే ఈ రండమూఝం స్పెషాలిటీ. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈచిత్రం కోసం.. ఇప్పుడు హాలీవుడ్ టీంను తీసుకొచ్చాడు దర్శకుడు వి.ఎ. శ్రీకుమార్.
వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లీ విటాకర్ ను ఈ సినిమాలో భాగం చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. వారితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు దర్శకుడు శ్రీకుమార్. లీ విటాకర్ తో చర్చలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగానే చెప్పాడు. ఎక్స్-మెన్.. అపోకలిప్సే.. ఇన్ టు ది స్టార్మ్.. ఫాస్ట్ ఫైవ్.. లైవ్ ఫ్రీ.. డై హార్డ్.. జురాసిక్ పార్క్ 3.. పెరల్ హార్బర్ వంటి అనేక హాలీవుడ్ చిత్రాలకు స్టంట్స్ అందించిన లీ.. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
ఈ మహాభారతాన్ని దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ను ఒక్క సినిమా కోసం కేటాయించడం విశేషం. 2018 ప్రారంభంలో షూటింగ్ మొదలు కానుండగా.. 2020 లో తొలిభాగాన్ని.. ఐదారు నెలల గ్యాప్ లో రెండో భాగాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.