Begin typing your search above and press return to search.
హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ని మరిపిస్తారట!
By: Tupaki Desk | 17 Sep 2022 2:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మునుపెన్నడూ లేనంతగా బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మొత్తం మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లున్నాయి. అందులో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న మూవీ 'ప్రాజెక్ట్ కె' ప్రత్యేకంగా నిలుస్తోంది. టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ కథగా ఈ మూవీని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇదే.
దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ప్రాజెక్ట్ పై పడింది. భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ప్రాజెక్ట్ కె'ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ స్టార్స్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోన్, దిషా పటాని హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసిన ఈ మూవీ కోసం ఆనంద్ మహీంద్రాని ప్రత్యేక వాహనాల కోసం నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేయడం.. ఆయన ప్రొవైడ్ చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినిమాలో వచ్చే యాక్షన్ ఘట్టాలు, కీలక వెహికిల్స్ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలని తలపిస్తాయని చెబుతున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ మూవీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారట. ఇందు కోసం ఇప్పటికే హాలీవుడ్ కు చెందిన యాక్షన్ డైరెక్టర్స్ ని ఇండియాకు రప్పించారట.
భవిష్యత్తులోకి వెళ్లే ఓ యువకుడి కథగా ఈ మూవీని రూపొందిస్తున్నారని, భవిష్యత్తులో సంభవించే థర్డ్ వరల్డ్ వార్ సన్నివేశాలు కూడా ఈ మూవీలో అత్యంత శక్తివంతంగా అబ్బురపరిచే రీతిలో చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాలో కళ్లు చెదిరో ఐదు యాక్షన్ అడ్వెంచర్ లు వుంటాయిని వాటిని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో హాలీవుడ్ టెక్నీషియన్ లతో తెరపైకి తీసుకురాబోతున్నారని, ఇవి సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తామని చెబుతున్నారు. ఇదొక విజువల్ వండర్ గా వుంటుందని, ఇందు కోసం బ్లూ అండ్ గ్రీన్ కోమాటిక్ టెక్నాలజీని వాడబోతున్నారని తెలుస్తోంది.
ఇండియన్ సినిమాల్లోనే విజువల్ ఎక్స్ట్రావగాంజాగా ఈ మూవీ నిలవనుందట. ఇదిలా వుంటే ఈ మూవీని 2024 ప్రధమార్థంలో అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నామని నిర్మాత సి. అశ్వనీదత్ వెల్లడించిన విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.