Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్పై థ్రిల్ల‌ర్?

By:  Tupaki Desk   |   29 April 2019 4:47 AM GMT
మ‌హేష్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్పై థ్రిల్ల‌ర్?
X
సౌత్ సినిమాకి అంత‌ర్జాతీయ స్థాయిలో అంత‌కంత‌కు గ్రిప్ పెరుగుతోంద‌న‌డానికి ఇదో తాజా ఎగ్జాంపుల్. రోబో.. ఈగ‌.. బాహుబలి.. 2.0 .. ఇలా సౌత్ సినిమా అంత‌ర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టి మ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చాయి. ఆయా సినిమాల‌కు హాలీవుడ్ లోనూ చ‌క్క‌ని గుర్తింపు ల‌భించింది. దీంతో మ‌న దర్శ‌క నిర్మాత‌లు.. హీరోల ప‌నిత‌నం ఏంటో ఆ స్థాయి ప్ర‌ముఖుల‌కు అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు ద‌క్షిణాది స్టార్ల‌ను క‌లుపుకుంటూ అంత‌ర్జాతీయ స్థాయి సినిమాల్ని రూపొందించేందుకు హాలీవుడ్ నుంచి పిలుపు అందుతోంది.

తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ కి అలాంటి ఓ పిలుపు అంద‌డం ఆస‌క్తి పెంచుతోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ స్పై థ్రిల్ల‌ర్ చేద్దామంటూ మ‌హేష్‌ ని హాలీవుడ్ ఫేమ‌స్‌ స్టార్ బిల్ డ్యూక్ లంచ్ కి పిల‌వ‌డం స‌ర్వత్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ బాండ్ ని హాలీవుడ్ కి పిలిచారంటూ అభిమానుల్లో అప్పుడే కోలాహాలం మొద‌లైంది. సూప‌ర్ స్టార్ కృష్ణ త‌ర్వాత టాలీవుడ్ బాండ్ గా మ‌హేష్ కి అభిమానుల్లో ఐడెంటిటీ ఉంది. అందుకే బిల్ డ్యూక్ పిలుపును అభిమానులు సీరియ‌స్ గానే తీసుకుంటున్నారు. ఇటీవల `అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌` ద‌ర్శ‌కుడు జో రుసో సైతం మ‌న సినిమా గురించి మాట్లాడారు. శంకర్ `రోబో` స్ఫూర్తితోనే `అవెంజర్స్‌: ది ఏజ్‌ ఆఫ్‌ ఆల్ట్రన్‌` సినిమాను తీశాన‌ని చెప్పారు. దీనిని బ‌ట్టి మ‌న సినిమా స్టాండార్డ్స్ పై ఏ స్థాయిలో చ‌ర్చ సాగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు.

మహేశ్‌- వంశీ పైడిపల్లి- తమిళ స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌. మురుగదాస్‌ లను హాలీవుడ్‌ స్టార్‌ బిల్‌ డ్యూక్‌ ఏకంగా లంచ్ కి పిల‌వ‌డం ఉత్కంఠను పెంచుతోంది. అన్నీ కుదిరితే ఓ అంతర్జాతీయ స్పై సినిమా తీద్దామంటూ వారిని లంచ్‌కు ఆహ్వానిస్తూ డ్యూక్ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిని పెంచింది. ``మ‌హేష్ - వంశీ పైడిపల్లి .. మీరు లాస్‌ ఏంజెల్స్‌ కు వచ్చినప్పుడు డీటీఎల్‌ ఏ (డౌన్‌ టౌన్‌ లాస్‌ ఏంజెల్స్‌)లో దిగి నాతో భోజనానికి రండి. ఇంటర్నేషనల్‌ స్పై సినిమా గురించి చర్చించుకుందాం`` అని బిల్ డ్యూక్ ట్వీట్ చేయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇన్నాళ్లు ఇరుగు పొరుగు భాష‌ల హీరోల్ని తీసుకుని మ‌న‌వాళ్లు సినిమాలు తీస్తున్నారు. ఇక‌పై హాలీవుడ్ స్టార్ల‌ను బ‌రిలో దించాల‌మో!! అలాగే మ‌న స్టార్ల‌ను హాలీవుడ్ కి ఎగుమ‌తి చేసే టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని భావించ‌వ‌చ్చు.