Begin typing your search above and press return to search.
ప్రభాస్ కోసం మళ్లీ హాలీవుడ్ నుంచి దిగుతున్నారా?
By: Tupaki Desk | 31 Aug 2022 9:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదుగా. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయిన డార్లింగ్ అటుపై అదే ఇమేజ్ తో ముందుకు సాగుతున్నారు. 'సలార్'..'ప్రాజెక్ట్ -కె'..'స్పిరిట్' లాంటి యూనివర్శల్ సబ్జెక్స్ట్ తో ముందుకెళ్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో యంగ్ మేకర్ మారుతితో ప్రభాస్ కమిట్ మెంట్ అందర్నీ సర్ ప్రైజ్ చేసింది.
ఇద్దరి కాంబినేషన్ లో ఓ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతన్నట్లు రివీల్ చేసారు. అయితే ఈ విషయంలో డార్లింగ్ అభిమానులు కాస్తంత అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ మారుతితో సినిమా చేయడం కరెక్టేనా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ..రచ్చ నడుస్తోంది.
అయినా వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా డార్లింగ్ ప్రాజెక్ట్ ని మూవ్ చేస్తున్నారు. రాజా డీలక్స్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తాత-మనవల కథని ఓ థియేటర్ నేపథ్యంతో సాగే స్టోరీ అని వినిపిస్తుంది. ఇదే అంశాన్ని మారుతి మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాత-మనవడు రెండు పాత్రల్లోనూ డార్లింగ్ కనిపించనున్నాడని సమాచారం.
ఒక పాత్ర పాడు బడిన థియేటర్ వారసుడిది అయితే..మరో పాత్రలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే తాత పాత్ర అని సమాచారం. అయితే ఈ రెండు పాత్రల కోసం మారుతి ఏకంగా హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల్నే రంగంలోకి దించుతున్నారుట. అందులోనూ హాలీవుడ్ బేస్డ్ స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ టీమ్ ని తీసుకొస్తున్నారుట. రెండు పాత్రలకు సంబంధించి ముందుగా మేకప్ టెస్ట్ షూట్ చేస్తారుట.
తాత పాత్ర ఆహార్యంలో డార్లింగ్ ఒకే అనిపించగల్గితే కంటున్యూ చేస్తారుట. లేదంటే ఆ పాత్రకి వేరే నటుడ్ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాత పాత్ర కి ఛాయిస్ గా సీనియర్ నటుడు కృష్ణంరాజు మారుతి దృష్టిలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే డార్లింగ్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల్ని దించడం మూడవసారి అవతుంది. అప్పట్లో బాహుబలి కోసం...ఆ తర్వాత సాహో కోసం ఇంగ్లీష్ మేకప్ ఆర్టిస్టుల్నే దిగుమతి చేసిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.