Begin typing your search above and press return to search.
బాబూ మాకు క్రెడిట్స్ ఇవ్వరా?
By: Tupaki Desk | 3 July 2015 4:03 AM GMTవిషయ పరిజ్ఞానం లేకుండా వార్త రాసినప్పుడు అది ఆ సంస్థ పరువు ప్రతిష్ఠలను మంట కలిపేసిన సందర్భాలెన్నో. స్థానిక పత్రికల నుంచి ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కల్లోలాలే రేగాయి. అయితే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి సినిమా విషయంలో ఓ ప్రముఖ హాలీవుడ్ మీడియా ''హాలీవుడ్ రిపోర్టర్'' ఘోరమైన తప్పిదాల్ని రాసింది.
బాహుబలి ఓ తమిళ సినిమా. ఇందులో నటించిన ప్రభాస్, రానా తమిళ స్టార్ నటులు అంటూ రాసుకొచ్చింది. ఇది చదివిన తెలుగువారంతా పెద్ద షాకవ్వడమే కాదు.. అసలు ఓ అంతర్జాతీయ ప్రమాణాలున్న సంస్థ ఇలాంటి రాంగ్ ఇన్ఫో ఎలా రాస్తుంది? ఇదే విషయంపై ఆన్‌లైన్‌లో, సామాజిక వెబ్‌సైట్లలో పెనుదుమారానికి తెరలేపారు ఫ్యాన్స్. సదరు హాలీవుడ్ రిపోర్టర్ వెబ్‌సైట్‌లో ఉన్న ఆర్టికల్‌పై మనోళ్ళు కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో సదరు పోర్టల్ ఎడిటర్ స్వయంగా రంగంలోకి దిగి తప్పును సరిదిద్దాల్సి వచ్చింది. అయితే ఇక్కడే ఓ ట్విస్టుంది.
ఎక్కడో మనకి సంబంధం లేని చోట ఉన్న హాలీవుడ్ మీడియా చేసిన తప్పును మనం క్షమించేయవచ్చు. కాని పొరుగున ఉన్న హిందీ మీడియా సైతం బాహుబలి ఓ తమిళ సినిమా అంటూ ఆ మధ్యన పరువు తీసింది. దాదాపు 250కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న బాహుబలి దేశంలోనే భారీ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా దేశానికి ప్రతిష్ఠాత్మకం అయినా కూడా, తెలుగువాడు కూడా మాదేనంటూ గర్వంగా చెప్పుకునే సినిమా. అటువంటిది మనకే క్రెడిట్ ఇవ్వకపోతే ఎలా మరి..
అసలు దక్షిణాది అంటే తమిళ సినిమా ఒక్కటే అన్న బ్రమల్లో ఉన్నారంతా. వందల కోట్ల వసూళ్లను తెచ్చే తెలుగు రీమేకులపై ఆధారపడుతున్న బాలీవుడ్ వాళ్లు ఇలా తెలుగువారిని తక్కువ చేసి చూస్తారా??