Begin typing your search above and press return to search.
హాలీవుడ్ నుంచి దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్..!
By: Tupaki Desk | 2 Jun 2022 1:30 PM GMTహాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ సినిమాలకు ఇండియాలోనూ అభిమానులున్నారు. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ''బుల్లెట్ ట్రైన్'' అనే పూర్తి స్థాయి యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కోటారో ఇసాకా రాసిన 'బుల్లెట్ ట్రైన్' అనే జపాన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డేవిడ్ లీచ్ ఈ ఫన్ యాక్షన్ థ్రిలర్ కు దర్శకత్వం వహించారు. జాక్ ఓల్కెవిచ్ స్క్రీన్ ప్లే అందించారు.
ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పాండమిక్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. చివరగా జూలై 15న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు 2022 ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
హాలీవుడ్ సినిమాలకు ఇండియాలోనూ మంచి మార్కెట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇటీవల భారతీయ భాషల్లోకి డబ్ కాబడిన పలు ఇంగ్లీష్ సినిమాలు విశేష ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో ''బుల్లెట్ ట్రైన్'' చిత్రాన్ని కూడా ఇండియన్ లాగ్వేజెస్ లోకి అనువధిస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళం వంటి పలు ప్రధాన భాషలలో 'బుల్లెట్ ట్రైన్' సినిమాని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా తాజాగా ఆవిష్కరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని కలిగించింది.
ఇందులో బ్రాడ్ పిట్ తో పాటుగా 'కిస్సింగ్ బూత్' ఫేమ్ జోయి కింగ్ - స్టార్ హీరోయిన్ సాండ్రా బుల్లక్ - ఆరోన్ టేలర్ జాన్సన్ - బ్రియాన్ టైరీ హెన్రీ - ఆండ్రూ కోజి - హిరోయుకి సనాడ - మైఖేల్ షానన్ - బాడ్ బన్నీ ఇతర కీలక పాత్రలు పోషించారు.
జోనాథన్ సెలా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా.. డొమినిక్ లూయిస్ మ్యూజిక్ సమకూర్చారు. కొలంబియా పిక్చర్స్ - ఫుక్వా ఫిల్మ్స్ మరియు 87 నార్త్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ను నిర్మించాయి.