Begin typing your search above and press return to search.
సావిత్రి కోసం హాలీవుడ్ కెమేరామ్యాన్
By: Tupaki Desk | 7 July 2017 11:41 AM GMTటాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ 'మహానటి'. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవితంపై రూపొందుతున్న ఈ మూవీ దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల కానుండగా.. ఈ సినిమా కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్.. ప్రధానమైన పాత్రలో సమంత నటిస్తుండగా.. దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పలువురు స్టార్లు ఈ చిత్రంలో కేమియో రోల్స్ చేసే అవకాశం ఉండగా.. ఈ చిత్రం కోసం డాని సాంచెజ్-లోపెజ్ అనే సినిమాటోగ్రాఫర్ ను తీసుకొచ్చారు. హాలీవుడ్ తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా తన కెమేరా పనితనం చూపించిన డాని.. ఈ పీరియాడిక్ మూవీకి న్యాయం చేసేందుకు కష్టపడుతున్నాడు. 1960.. 70.. 80ల కాలం నాటి తెలుగు సినిమా ఎలా ఉందో అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా కలర్ థీమ్స్.. సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది.
ఆ కాలం నాటి పరిస్థితులను ఎంత సమర్ధంగా చూపగలిగితే.. మహానటి చిత్రానికి అంతటి బలం చేకూరుతుందన్న మాట. అన్ని రకాల కెమేరాలపై పట్టు ఉండాలి. లైటింగ్ థీమ్స్ పై కూడా పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. ఇంతటి సమర్ధమైన పనులు చేయాల్సి ఉండడంతో డాని సాంచెజ్ ను తీసుకొచ్చారు మహానటి టీం.