Begin typing your search above and press return to search.

బన్నీ కోసం హాలీవుడ్ కెమేరా వర్క్

By:  Tupaki Desk   |   18 April 2018 4:59 PM GMT
బన్నీ కోసం హాలీవుడ్ కెమేరా వర్క్
X
అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య మూవీ విడుదలకు సర్వం సిద్ధం అయిపోతోంది. ఈ సారి టాలీవుడ్ సమ్మర్ బొనాంజాలో భాగంగా మే 4న వస్తున్న భారీ చిత్రం నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా. ఈ సమ్మర్ కి ఇదే చివరి బిగ్ బడ్జెట్ మూవీ. ఈ చిత్రాన్ని అన్ని విధాలుగాను అత్యంత ఆకర్షణీయంగా.. ప్రతీ ఫ్రేమ్ ను విజువల్ రిచ్ గా చూపించేందుకు మేకర్స్ అనేక చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం నా పేరు సూర్య షూటింగ్ పనులు చివరి దశకు వచ్చేయగా.. చివరగా ఒక పాటను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్ ను తీసుకురావడం విశేషం. పలు హాలీవుడ్ చిత్రాలతో పాటు.. షార్ట్‌లకు కెమేరా వర్క్ అందించిన జోసెఫ్ లబిసి పిక్చరైజేషన్ లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. హీరో అల్లు అర్జున్.. హీరోయిన్ అను ఇమాన్యుయేల్ పై ఈ రొమాంటిక్ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ రవి వంటి ట్యాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించినా.. ఈ పాట వరకు ప్రత్యేకంగా ఉండడం కోసం ఇలా హాలీవుడ్ టెక్నీషియన్ ను తీసుకొచ్చారు.

ఇక ఏప్రిల్ 22న గ్రాండ్ ఈవెంట్లో నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్ చేయనుండగా.. ఈ నెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ప్రస్తుతం బన్నీ ఉన్న భీకరమైన ఫామ్ ను బేస్ చేసుకుని.. ఈ చిత్రంపై అంచనాలు క్షణక్షణానికి పెరిగిపోతూనే ఉన్నాయి.