Begin typing your search above and press return to search.
నితిన్ మూవీ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్
By: Tupaki Desk | 19 Jun 2020 10:50 AM GMTనితిన్ హీరోగా కృష్ణ చైతన్యదర్శకుడి గా ఒక భారీ చిత్రం రూపొందబోతున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా ‘పవర్ పేట’ అనే స్క్రిప్ట్ పై కృష్ణ చైతన్య వర్క్ చేస్తున్నాడు. నితిన్ కెరీర్ లోనే నిలిచి పోయేలా ఆ సినిమా ఉంటుందని అంటున్నారు. సినిమాలో నితిన్ మూడు విభిన్నమైన వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడట. 20 ఏళ్ల కుర్రాడిగా 40 ఏళ్ల మద్య వయస్కుడిగా 60 ఏళ్ల వృద్దుడిగా నితిన్ ‘పవర్ పేట’ చిత్రంలో కనిపించనున్నాడు.
నితిన్ లో ఇంతగా వేరియేషన్స్ చూపించేందుకు ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు ను ఈ చిత్రం కోసం పని చేయించాలని భావిస్తున్నారట. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఈ సినిమాను స్వయంగా నితిన్ నిర్మించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు పూర్తి అయ్యి విడుదల అయిన తర్వాత అంటే వచ్చే ఏడాదికి ఈ పవర్ పేట చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.
నితిన్ రంగ్ దే చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. బాలీవుడ్ చిత్రం అంధాదున్ ను కూడా నితిన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేప్పటికి పవర్ పేట ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా దర్శకుడు కృష్ణ చైతన్య పూర్తి చేసే అవకాశం ఉంది. గత మూడు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న నితిన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి మళ్లీ కెమెరా ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మొదట రంగ్ దే ను పూర్తి చేసి ఆ తర్వాత రీమేక్ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.