Begin typing your search above and press return to search.
మల్టీవర్స్ లు యూనివర్శ్ లతో ఏం జరగబోతోంది?
By: Tupaki Desk | 20 Jun 2022 3:29 AM GMTసినీవరల్డ్ లో కంటెంట్ పరంగా ఊహించని పెనుమార్పులు ఇటీవలి కాలంలో ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. వీటిలో మల్టీవర్స్ ఫ్రాంఛైజీల ట్రెండ్ అసాధారణమైనదని అన్ని పరిశ్రమలు గుర్తిస్తున్నాయి. నిజానికి హాలీవుడ్ లో ఇది చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. భారీ విజయాలు సాధించిన సినిమాలకు సీక్వెల్స్ ట్రయాలజీలు తెరకెక్కించడం అక్కడ ఎంతో పెద్ద సక్సెస్ అయ్యింది. అదే క్రమంలో ఇప్పుడు సూపర్ నేచురల్ కంటెంట్ లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో మల్టీవర్స్ లను క్రియేట్ చేస్తూ దర్శకరచయితలు అద్భుతాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని పదే పదే థియేటర్లకు రప్పించే భారీ విజువలైజేషన్ కి సంబంధించిన కంటెంట్ ని సృజిస్తున్నారు.
ప్రపంచ భాషలకు చెందిన గొప్ప స్టార్లను ఐక్యం చేసి సీక్వెల్స్ పేరుతో అన్ని దేశాల్లోనూ భారీ మార్కెట్ ని సాధిస్తూ బిలియన్ డాలర్ వసూళ్లతో హాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే ఈ కల్చర్ ఇకపై ఇండియాలో ఊపందుకోనుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మొదలైంది. కానీ పెద్ద దిక్కు అనుకున్న బాలీవుడ్ ఇందులో ఇప్పటివరకూ పెద్దగా సక్సెస్ కాలేదు.
అక్కడ సూపర్ నేచురల్ కంటెంట్ లార్జర్ దేన్ లైఫ్ పాత్రల క్రియేషన్ అనేది ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. రేర్ గా క్రిష్ ఫ్రాంఛైజీ.. ధూమ్ ఫ్రాంఛైజీలో ఈ తరహా లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు కనిపించినా చాలా ఫ్రాంఛైజీల్లో వాస్తవిక పాత్రలతోనే రన్ ని కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆడియెన్ మైండ్ సెట్ మారింది. నిరంతరం దేశంపై దండయాత్ర చేస్తున్న హాలీవుడ్ మల్టీవర్స్ ఫ్రాంఛైజీలు ఇక్కడి ప్రజల మైండ్ సెట్ ని అమాంతం మార్చేస్తున్నాయని గ్రహించాలి.
లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు వాటిని సపోర్ట్ చేసే కంటెంట్ తో సినిమాల్ని తెరకెక్కిస్తే అవి బాహుబలి - ఆర్.ఆర్.ఆర్ రేంజులో సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. కేజీఎఫ్ - సాహో లాంటి మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కే సినిమాల కంటే వీటికి ప్రపంచ సినిమాలో ప్రాముఖ్యత కూడా ఎక్కువ. వీటికి రీచబిలిటీ పరిధి కూడా ఎక్కువ. ఇటీవల ప్రపంచ సినీప్రముఖులు ఆర్.ఆర్.ఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్న తీరు దీనికి నిదర్శనం.
దేశంలోని అన్ని భాషలకు కనెక్టయ్యే పాన్ ఇండియా ముఖాలతో మల్టీవర్స్ ల సృజనకు శ్రీకారం చుట్టడం అన్నది ఇంకా భారతదేశంలో ప్రాథమిక దశలోనే ఉంది. ఖాన్ ల త్రయం లార్జర్ దేన్ లైఫ్ పాత్రలపై ఇంకా ఎక్కువ ఆసక్తితో లేరు. రా-వన్ లాంటి ప్రయోగం చేసి విఫలమైన షారూక్ మళ్లీ అలాంటి ఆలోచన చేయలేదు. ఇకపోతే ఖాన్ ల త్రయం దీనిపై ఆసక్తిగా ఉన్నట్టు కూడా కనిపించదు.
ఇక రణబీర్ బ్రహ్మాస్త్ర-షంషేరా లుక్ లు చూస్తుంటే అతడు లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో ముందుకు వస్తున్నట్టు అర్థమవుతోంది. బ్రహ్మాస్త్రను ట్రయాలజీ కేటగిరీలో వరుసగా సిరీస్ గా రూపొందించనుండడం ఆసక్తిని పెంచుతోంది. కానీ త్వరలో విడుదల కానున్న పార్ట్ 1 సక్సెస్ పై ఇది ఆధారపడి ఉంది.
దేశంలో సినిమా భవిష్యత్ మునుముందు అమాంతం మారుతుందని కూడా భావించాల్సి ఉంటుంది. భారీ పెట్టుబడులు వెదజల్లే అంతర్జాతీయ ప్రొడక్షన్ కంపెనీల టై అప్ లతో అత్యంత భారీ బడ్జెట్లతో అవెంజర్స్-థోర్- ఆక్వామేన్- అవతార్- కెప్టెన్ అమెరికా .. ఇలా ఎన్నో హాలీవుడ్ ఫ్రాంఛైజీ సినిమాల రూపకల్పన జరుగుతోంది. అదే తరహాలో ఇకపై బాలీవుడ్ టాలీవుడ్ లో భారీ టై అప్ లతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ కేటగిరీలో భారీ మల్టీవర్స్ లు యూనివర్శ్ లను క్రియేట్ చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. మేకర్స్ లో మారుతున్న మైండ్ సెట్ గట్ ఫీలింగ్ తో ఏదైనా సాధ్యమని భావించాల్సి ఉంటుంది. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో సులువుగా 1000 కోట్లు అంతకుమించి వసూళ్లను ఇండియా నుంచి ఇండియా డయాస్పోరా నుంచి తేవడం కష్టమేమీ కాదని ప్రూవ్ అయ్యింది. ఇక హాలీవుడ్ తో ఈక్విలైజేషన్ కోసం క్రియేటివిటీ పరంగా బడ్జెట్ల గేథరింగ్ పరంగా భారతీయ ఫిలింమేకర్స్ ఎలాంటి పదును పెడతారు? అన్నది వేచి చూడాలి.