Begin typing your search above and press return to search.
అఖిల్ మూవీలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్
By: Tupaki Desk | 14 Aug 2021 9:30 AM GMTభారీ అంచనాల నడుమ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఈ హీరోకు మొదట్లో అనుకున్నంత సక్సెస్ లేదు. దాంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లను లైన్లో పెట్టి మరీ భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సైరాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ కోసం గతంలో ఎన్నడూ లేనంతగా అఖిల్ ఊర మాస్ లుక్ తో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఆయన లవర్ బాయ్ పేరు నుంచి మాస్ హీరోగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకు మాస్ లుక్ ను ట్రై చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇంతకు ముందు ఉన్న మూవీల్లో ఆయన లుక్ కు ఇప్పుడు చేస్తున్న మూవీలో ఉన్న లుక్ కు చాలా తేడా ఉంది. ఎంతలా అంటే ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీతో అందరి ఆశ్చర్యపరిచాడు. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ ఇంటెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చి హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ లో అఖిల్ కోసం ఏకంగా పదిహేను నిమిషాల పాటు ఓ భారీ చేజింగ్ సీన్ ని సురేందర్ రెడ్డి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ సీన్ కోసం హాలీవుడ్ రేంజ్ లో సెట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సీన్ కోసమే చిత్ర బృందం విదేశాలకు వెళ్ళనుందని.. అక్కడ అయితేనే ఇలాంటి సీన్ కు పర్ ఫెక్ట్ గా సెట్ అవుతుందని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి భావిస్తున్నారంట. ఆ సీన్ ను హాలీవుడ్ టెక్నీషియన్ల సాయంతో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెత్‌తో తీస్తున్న ఆ సన్నివేశం మూవీ మొత్తానికే హైలెట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి అఖిల్ కోసం ఓ రేంజ్లో ఖర్చు చేస్తున్న మూవీ.. ఈ 15 నిమిషాల పాటు ప్లాన్ చేసిన ఛేజింగ్ సీన్ కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతలా బడ్జెట్ ప్లాన్ చేస్తున్న సురేందర్‌రెడ్డి అఖిల్ మార్కెట్‌ను మించి ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి అఖిల్ ఈ సీన్లో ఏ విధంగా ఆకట్టుకుంటాడనేది మాత్రం వేచి చూడాల్సిందే.