Begin typing your search above and press return to search.
మహేష్.. పూరి.. ఓ హాలీవుడ్ స్టార్
By: Tupaki Desk | 13 Dec 2015 4:17 AM GMTటాలీవుడ్లో మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్ కున్న క్రేజే వేరు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి.. ఆల్ టైం బ్లాక బస్టర్ గా - ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. వీళ్లద్దరూ రెండోసారి ‘బిజినెస్ మేన్’ కోసం జత కట్టారు. ఆ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. మహేష్ తో హ్యాట్రిక్ సినిమా తీస్తానని రెండేళ్లుగా చెబుతూ ఉన్నాడు పూరి. ఇదిగో అదిగో అంటున్నాడు కానీ.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కట్లేదు. ఐతే త్వరలోనే తమ కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని.. ఆ సినిమా కోసం సన్నాహాలు మొదలయ్యాయని చెబుతూ.. ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు పూరి.
మహేష్-పూరి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో ఓ హాలీవుడ్ స్టార్ నటిస్తాడట. ‘‘మహేష్ తో కచ్చితంగా మూడో సినిమా చేస్తా. ప్రస్తుతం మహేష్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మా కాంబినేషన్ లో వచ్చే సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పడుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో ఓ ఇంటర్నేషనల్ స్టార్ మహేష్ తో పాటు స్క్రీన్ పంచుకుంటాడు. ప్రస్తుతం నేను స్క్రిప్టు పనిలో ఉన్నాను’’ అని చెప్పాడు పూరి. మామూలుగానే ఇది క్రేజీ కాంబినేషన్ అంటే.. పూరి భారీ బడ్జెట్ అని, ఇంటర్నేషనల్ స్టార్ కూడా నటిస్తాడని అంటుంటే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయేలా ఉన్నాయి.