Begin typing your search above and press return to search.

తార‌క్‌, చ‌ర‌ణ్ ల‌కు ఇంట్రెస్ట్ లేదా?

By:  Tupaki Desk   |   24 Aug 2022 9:32 AM GMT
తార‌క్‌, చ‌ర‌ణ్ ల‌కు ఇంట్రెస్ట్ లేదా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన పాన్ ఇండియా బిగ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `RRR`. జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌న‌దైన మాస్ట‌ర్ మైండ్ తో అ మూవీని తెర‌కెక్కించారు. 1920 ప్రీ ఇండిపెండెన్స్ కాలం నాటి ఫిక్ష‌నల్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీలో ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామారాజు, కొమురం భీం క‌లిసి బ్రిటీష్ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేస్తే ఎలా వుంటుంది? ఏం జ‌రిగిది? అనే ఫిక్ష‌న్ తో ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు.

భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ రికార్డు స్థాయి విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1200 కోట్ల‌కు మించి రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ మూవీతో ఒక్క‌సారిగా రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్ష‌న్ ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని వీక్షించిన విదేశీ ప్రేక్ష‌కులు, హాలీవుడ్ స్టార్స్ రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, రాజ‌మౌళిల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌స్తుతం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ బ‌రిలోనూ ఈ మూవీ నిల‌వ‌బోతోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌టి క్రేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరోస్ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోలేక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `RRR` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యంతో వ‌ర‌ల్డ్ వైడ్ గా పాపుల‌ర్ అయిన చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఆ ఫేమ్ ని, నేమ్ ని స‌రిగా క్యాష్ చేసుకోలేక‌పోతున్నారు.

ఇప్ప‌టికే ఈ మూవీ అందించిన క్రేజ్ తో వ‌రుస బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడ‌ర్ లుగా చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ సైన్ చేయాల్సింది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఇది వారికి ఇష్టం లేదా? లేక కావాల‌నే బ్రాండ్ ల‌కు దూరంగా వుంటున్నారా? అని ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. `పుష్ప‌` సినిమాతో బ‌న్నీ ఎలాంటి ప్ర‌చారం చేయ‌కుండానే ఉత్త‌రాదిలో సంచ‌ల‌నాలు సృష్టించాడు. ఈ మూవీ అందించి క్రేజ్ తో వ‌రుస బ్రాండ్ ల‌కు సైన్ చేస్తూ తీరిక లేకుండా స‌ద‌రు బ్రాండ్ ల ప్రోడ‌క్ట్ ల యాడ్ షూట్ లో పాల్గొంటూ ర‌చ్చ చేస్తున్నాడు.

బ‌న్నీకి మించిన క్రేజ్ ని `RRR`తో సొంతం చేసుకున్న రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ అయిపోయి త‌మ త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌తో బిజీగా మారిపోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ త‌న క్రేజ్ కి త‌గ్గ‌ట్టే ప్ర‌ముఖ బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. అందులో ముందుగా అంగీక‌రించిన బ్రాండ్ మ‌హీంద్ర.

ఈ బ్రాండ్ కి సంబంధించిన ఎస్ యూవీకి ప్ర‌భాస్ ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించి ఆ త‌రువాత బ్రాండ్ ల‌పై ఆస‌క్తిని చూపించ‌డం లేదు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కూడా ప్ర‌భాస్ త‌ర‌హాలోనే వ్య‌వ‌హ‌రిస్తూ `RRR` క్రేజ్ ని క్యాష్ చేసుకోలేక‌పోతుండ‌టం గ‌మ‌నార్హం.