Begin typing your search above and press return to search.
'లైగర్' కోసం జాకీచాన్ చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్..!
By: Tupaki Desk | 6 April 2021 11:56 AM GMTడాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ పాన్ ఇండియా సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే సందడి చేయనున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం వీడీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఇప్పటికే ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. పూరీ ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడు. అందుకే యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడం కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ని 'లైగర్' కోసం తీసుకొచ్చారు.
జాకీచాన్ సినిమాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ 'లైగర్' కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే ఆండీ ఆధ్వర్యంలో పలువురు విదేశీ ఫైటర్స్ తో కలిసి యాక్షన్ ఎపిసోడ్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ పొడవాటి జుట్టుతో మాస్ లుక్ లో విభిన్నంగా కనిపించనున్నారు. అలానే అతని యాటిట్యూడ్ ఢిఫరెంట్ గా ఉండటంతో పాటు పూరీ మార్క్ డైలాగ్స్ తో మెప్పించబోతున్నాడని టాక్. ఇప్పటికే విడుదలైన ‘లైగర్’ ఫస్ట్ లుక్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
'లైగర్' చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను తదితరులు నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఫై పూరీ జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న 'లైగర్' ను రిలీజ్ చేయనున్నారు.