Begin typing your search above and press return to search.
ఈ ఏజ్ లో స్టంట్స్ ఎందుకు?
By: Tupaki Desk | 20 Dec 2019 7:39 AM GMTఏజ్ కి తగ్గ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. బాడీ సహకరించేంతవరకూ రిస్కీ స్టంట్స్ కి ఓకే కానీ.. ఒకసారి ఏజ్ 60 బార్డర్ ని టచ్ చేస్తే ఇక ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి రిస్క్ చేసే విషయంలో మన వెటరన్ హీరోలు ఏమాత్రం తగ్గడం లేదని అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుంచే కాదు హాలీవుడ్ నుంచి స్టంట్ కొరియోగ్రాఫర్ల ను బరిలో దించి మరీ భారీ సాహసాలకు తెగిస్తున్నారు. రూలర్ చిత్రంలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒంటి చేత్తో వందమందిని మట్టి కరిపించేంత రిస్క్ చేశారు. కొరటాల మూవీలో మెగాస్టార్ భారీ స్టంట్స్ చేయనున్నారని తెలుస్తోంది.
అలాగే కింగ్ నాగార్జున ఎక్కడా తగ్గడం లేదట. ఆయన ఈసారి ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. అది కూడా కాప్ డ్రామా కావడంతో చాలా రిస్క్ కి రెడీ అవుతున్నారట. నాగార్జున నటించిన గత చిత్రాలు ఆఫీసర్ - మన్మధుడు 2 తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ క్రమంలోనే స్క్రిప్ట్ పరంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఓ పోలీసాఫీసర్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు సోలమన్ వినిపించిన కథకు ఓకే చెప్పాడు. ఈ చిత్రంలో ఓ భీకరమైన కాప్ ఆపరేషన్ ఉంటుందట. ఎపిసోడ్ ఆద్యంతం ఛాలెంజింగ్ గా రిస్కీ ఫైట్స్ చేయాల్సి ఉంటుంది. కానీ నాగార్జున ఎక్కడా తగ్గడం లేదట. విదేశీ స్టంట్ మన్ తో భారీ యాక్షన్ కి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఇక ఆ సీక్వెన్స్ కోసమే ప్రత్యేకించి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను బరిలో దించారు. పోలీసాఫీసర్స్ సీక్రెట్ ఆపరేషన్ ఎలా చేయాలి? అన్నదానిపై వర్క్ షాప్ కూడా చేస్తున్నారట. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జనవరి నుంచి నాగార్జున చిత్రీకరణలో పాల్గొంటారు. 2020 వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
అయితే కింగ్ పై నెటిజనుల్లో రకరకాలుగా చర్చ సాగుతోంది. భారీ యాక్షన్ సరే కానీ.. ఈ ఏజ్ లో కింగ్ కి రిస్కులు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు విక్టరీ వెంకటేష్ లాంటి హీరో కెరీర్ ని స్మార్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియెన్ ని టచ్ చేసే సింపుల్ కథాంశాల్ని ఎంచుకుంటూ సైలెంటుగా హిట్లు కొడుతుంటే నాగార్జున వరుస ప్రయోగాలతో ఇంకా యాక్షన్ అంటూ ఉన్నారు. మరి చూడాలి.. ఆయన తాజా ప్రయత్నం ఏ మేరకూ సక్సెసవుతుందో?