Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ రావాల్సిందే అంటున్న హాలీవుడ్ రచయితలు
By: Tupaki Desk | 14 July 2022 4:34 AM GMTRRR సంచలనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. 2022లో 1000 కోట్ల క్లబ్ చిత్రంగా రికార్డులకెక్కింది. ఇందులో నటించిన తారలకు చక్కని గుర్తింపు దక్కింది. ముఖ్యంగా బ్రిటీష్ కి సహకరించే సైనికుడిగా పని చేసిన రామ్ చరణ్ పేరు ఇప్పుడు విదేశాల్లో మార్మోగుతోంది. అంతేకాదు..
RRR హాలీవుడ్ లో తన గుర్తింపునకు సహాయపడుతోంది. పాశ్చాత్య దేశాలలో ప్రజల ప్రేమను పొందడంలో అతనికి సహకరిస్తోంది. అంతేకాదు పలువురు హాలీవుడ్ రచయితలు అతని కోసం 'సినిమా కథలు రాయాలని' కోరుకున్నారు. చరణ్ నటిస్తానంటే హాలీవుడ్ కి తీసుకెళతామని ప్రేమను కురిపిస్తున్నారు.
RRR ఈ సంవత్సరం అతిపెద్ద విజువల్ మాస్టర్ పీస్ లలో ఒకటి. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కించుకుంది. కథానాయకులు రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ల కెరీర్ కి ఈ మూవీ చాలా సహాయపడుతోంది. ఇటీవల ప్రముఖ హాలీవుడ్ దర్శకరచయిత ఆరోన్ స్టీవర్ట్ అహ్న్ రామ్ చరణ్ కోసం సినిమా కథను రాయాలని తన కోరికను వ్యక్తం చేశాడు. తన ట్విట్టర్ లో ఇలా పేర్కొన్నాడు.
"రామ్ చరణ్ వంటి సినీ నటుడి కోసం ఒక సినిమా రాయడం ఇష్టం. అలాంటి గొప్ప నటుడితో పనిచేయడానికి ఇష్టపడతాను. కానీ అతను అంతర్జాతీయ ప్రొడక్షన్స్ లో పనిచేస్తే తప్పక హాలీవుడ్ లో నటించాలి! అతడు అలా చేస్తాడా లేదా? అన్నది అర్థం కాలేదు. మరిన్ని గొప్ప భారతీయ సినిమాల కోసం నేను ఇక్కడ వేచి చూస్తున్నాను" అని తన మనసును బయటపెట్టారు.
నిజానికి RRR హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మిడ్ సీజన్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్రం విభాగంలో రన్నరప్ గా నిలిచింది. చరణ్ - తారక్ లతో పాటు అలియా భట్ -అజయ్ దేవగన్ వంటి తారలకు ఇది ఎంతో గౌరవాన్ని పెంచింది.
SS రాజమౌళి కి ప్రపంచ సినీయవనికపై గొప్ప ఖ్యాతి దక్కింది. RRR ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరుకుంది. అసాధారణ ప్రశంసలు అందుకుంది. ఈ భారీ ఎపిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. భారతదేశం నుంచి రూ. 902 కోట్లు .. ప్రపంచవ్యాప్తంగా రూ. 1111 కోట్లు వసూలు చేసింది.