Begin typing your search above and press return to search.
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. యువ హీరో మృతి
By: Tupaki Desk | 12 Feb 2023 4:35 PM ISTసెలబ్రిటీల మరణాలు చాలా వరకు మిస్టరీగానే మిగిలిపోతూ ఉంటాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది మరణం అంతుచిక్కకుండా ఇప్పటికి ఉన్నాయి. టాలీవుడ్ ఐటెం యాక్టర్ సిల్క్ స్మిత మరణం ఎలా జరిగింది అనేది ఇప్పటికి చాలా మందికి అర్ధం కాని ప్రశ్న. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటే హత్య అని కొందరు వాదిస్తారు. అలాగే దివ్యభారతి మరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె బిల్డింగ్ మీద నుంచి క్రింద పడి చనిపోయింది.
ఇక శ్రీదేవి మరణంపై కూడా ఇప్పటికి చాలా మంది అనుమానంతో చూస్తారు. తాజాగా హాలీవుడ్ యంగ్ హీరో కాడీ లాంగో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. 34 ఏళ్ళ కాడీ తన ఇంట్లోనే విగాతజీవిగా పడి కనిపించాడు. అతని అతని ఎలా మృతి చెందాడు అనేది ఇప్పటికి తెలియరాలేదు. పలు హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించి నటుడిగా కాడీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న అతను అర్ధంతరంగా చనిపోవడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చాలా కాలంగా అతను మాదకద్రవ్యాలకి బానిస అయినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో గత ఏడాది రిహాబిలేషన్ సెంటర్ కి కూడా వెళ్లి వచ్చారు. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన మృతిపై అతని మేనేజర్ ట్వీట్ చేశారు.
నా ప్రియమైన స్నేహితుడు, కా క్లయింట్ కాడీ లాంగో మరణం తనని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయనకి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మిస్ యూ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే కాడీకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇక పిల్లల భవిష్యత్తు కోసం కాడీ చాలా కష్టపడేవాడని అతని భార్య తెలియజేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా హాలీవుడ్ నటుడి మరణం ఇప్పుడు మిస్టరీగానే కనిపిస్తుంది.